విరసం నేత, ప్రజాకవి వరవరరావు కరోనా వైరస్ బారినపడ్డారు. ముంబయిలోని తలైజా జైలులో ఉన్న వరవరరావు గతకొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో మెరుగైన చికిత్స నిమిత్తం ముంబయిలోని జేజే ఆస్పత్రికి జైలు సిబ్బంది తీసుకెళ్లారు. అయితే అక్కడ కరోనా లక్షణాలు కనబడడంతో వెంటనే పరీక్షలు నిర్వహించారు. దీంతో వరవరరావుకి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
ప్రస్తుతానికి అతని ఆరోగ్యం నిలకడగా ఉందని ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. కాగా, భీమా కోరేగావ్ కేసులు ఆరోపణలు ఎదుర్కొంటున్న వరవరరావును ఎన్‌ఐఏ అరెస్ట్ చేసి తలోజా జైలుకు తరలించిన విషయం తెలిసిందే. వరవర రావుతో పాటు మరో నలుగురిని పుణె పోలీసులు 2018 ఆగస్టులో అరెస్టు చేశారు. సుప్రీం కోర్టు ఆదేశాలతో కొన్ని రోజులు వీరిని గృహ నిర్బంధంలో ఉంచిన అధికారులు, ఆ తర్వాత మళ్లీ జైలుకు తరలించారు.