ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ అత్యంత వేగంగా విస్తరిస్తుంది. ఊహించని విధంగా కరోనా కేసులు ప్రపంచ వ్యాప్తంగా పెరగడం ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతుంది. ఆదివారం వరకు ఆరు నుంచి ఏడు లక్షల మధ్యలో ఉన్న కరోనా కేసులు… ఇప్పుడు ఒక్కసారిగా 9 లక్షలకు చేరువలో ఉండటం ఆందోళన కలిగిస్తుంది. అమెరికా సహా అనేక దేశాల్లో కరోనా వైరస్ చెలరేగిపోయే పరిస్థితి ఇప్పుడు నెలకొంది.
ఇప్పటి వరకు 8 లక్షల 56 వేల మందికి పైగా కరోనా వైరస్ సోకింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా మరణాలు 43 వేలకు దగ్గరలో ఉన్నాయి. ఇవి మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలో కరోనా వైరస్ కారణంగా లక్ష మంది మరణించే అవకాశం ఉందని ఆ దేశ అధికారిక భవనం వైట్ హౌస్ కీలక ప్రకటన చేసింది. అమెరికాకు రెండు వారాలు కీలకమని ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ అన్నారు.
ఇక చైనాలో కూడా కరోనా వైరస్ మళ్ళీ వేగం పుంజుకునే అవకాశాలు కనపడుతున్నాయి. కరోన కేసులు మరింతగా పెరిగే అవకాశాలే కనపడుతున్నాయి. తగ్గినట్టే తగ్గిన కరోనా కేసులు ఇప్పుడు ఒకసారిగా పెరగడం ఆందోళన కలిగిస్తుంది. కరోనా వైరస్ ని కట్టడి చేసే విషయంలో ప్రపంచ దేశాలు దాదాపుగా చేతులు ఎత్తేసాయి. ఇటలీ, స్పెయిన్ సహా కొన్ని దేశాల్లో పరిస్థితి మరింతగా దిగజారినట్టే కనపడుతుంది.