ఒకే వేదిక పై ఇద్దరు మాజీ సీఎంలు..!

-

ఒకే వేదికపై ఇద్దరూ మాజీ సీఎంలు కలిశారు. రాజంపేట బహిరంగ సభలో చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి కలిసి ప్రచారం నిర్వహించారు. గతంలో ఉప్పు నిప్పుగా ఉండే వీరిద్దరూ ఇప్పుడూ ఒకే వేదిక పంచుకోవడం సర్వత్రా ఆసక్తిగా మారింది. రాజంపేట బీజేపీ ఎంపీ అభ్యర్థిగా కిరణ్ కుమార్ పోటీ చేస్తున్నారు. అలాగే ఎమ్మెల్యే అభ్యర్థిగా సుగవాసి బాలసుబ్రహ్మణ్యం బరిలో ఉన్నారు. వీరి తరపున బాబుతో పాటు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కూడా ప్రచారం నిర్వహించారు.

టీడీపీ అధినేత చంద్రబాబు వరాలు కురిపించారు. పవన్ కల్యాణ్ కలిసి ఎన్డీయే అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాజంపేటను జిల్లా కేంద్రం చేస్తామని చెప్పారు. అంతేకాదు అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. జిల్లా చేయకుండా రాజంపేట ప్రజలకు అన్యాయం చేశారని మండిపడ్డారు. రాజంపేట, రాయచోటి, మదనపల్లెకి అన్యాయం చేయమని చెప్పారు. ప్రజాభిప్రాయంతోనే పాలన అందిస్తామన్నారు. అన్నమయ్య ప్రాజెక్టును బాగు చేసి బాధితులను అండగా ఉంటామని చెప్పారు. గాలేరు-నగరి కాలవను పూర్తి చేసి కృష్ణా జలాలు అందిస్తామని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రాజంపేటలో విజయోత్సవ సభ నిర్వహిస్తామని చంద్రబాబు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news