సుమీ నుంచి బయటపడుతున్న ఇండియన్స్… స్పెషల్ ట్రైన్ ద్వారా ఉక్రెయిన్ సరిహద్దులకు

-

రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం కారణంగా ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయులతో పాటు ఇతర దేశస్తులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలో ఉన్న భారతీయులను పశ్చిమ సరిహద్దులకు తరలించడం కష్టంగా మారింది. ఇదిలా ఉంటే మరోసారి ఈరోజ రష్యా కాల్పలు విరామాణాన్ని ప్రకటించింది. కీవ్, చెర్నిహెవ్, ఖార్కీవ్, సుమీ, మరియోపోల్ నగరాల్లో కాల్పుల విరమణ ప్రకటించింది. దీంతో సుమీలో చిక్కుకుపోయిన భారతీయులను స్పెషల్ ట్రైన్ ద్వారా పశ్చిమ సరిహద్దు ప్రాంతాలకు చేరుస్తున్నారు. భారతీయ విద్యార్ధును సేఫ్ గా తీసుకురావడం మాకు ప్రాధాన్యం అని భారత విదేశాంగ శాఖ, ఉక్రెయిన్ లోని భారత ఎంబసీ ప్రకటించింది.

ఆపరేషన్ గంగ ద్వారా ఇప్పటి వరకు 18 వేల భారతీయులను స్వదేశానికి చేర్చారు. కేవలం తూర్పు ప్రాంత నగరాలైన  ఖార్కీవ్, సుమీ విద్యార్థులను తీసుకురావడం ఆలస్యం అయింది. అక్కడ తీవ్రమైన యుద్ధం కారణంగా ఈ సమస్య ఎదురైంది. ఇటీవల భారత ప్రధాని నరేంద్రమోదీ, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీతో పాటు రష్యా అధ్యక్షుడు పుతిన్ తో మాట్లాడి భారతీయుల తరలింపుకు సహకరించాలని  కోరారు. దీంతో నిన్న, ఈరోజు రష్యా కాల్పుల విరామం ప్రకటించింది. 

పోలాండ్, స్లోవేకియా, రొమేనియా, హంగేరీ దేశాల నుంచి భారతీయ విద్యార్థులను తరలించారు. ఫిబ్రవరి 22న మొదలైన ఈ ఆపరేషన్ లో 75 పౌరవిమానాలతో పాటు భారతీయ వాయుసేనకు సంబంధించిన సీ17 విమానాలు పాల్గొన్నాయి. మనదేశంతో పాటు నేపాల్, బంగ్లాదేశ్ విద్యార్థులను కూడా తీసుకువచ్చాము. బంగ్లాదేశీయులను తీసుకురావడంలో సహకరించినందుకు బంగ్లాా ప్రధాని షేక్ హసీనా, ప్రధాని మోదీకి థాంక్స్ చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news