రష్యాకు చుక్కులు చూపిస్తోంది ఉక్రెయిన్. తన బలాన్ని, బలగాన్ని మోహరించి రష్యా యుద్ధం చేస్తున్నా.. ఉక్రెయిన్ లొంగడం లేదు. ఆరు రోజులుగా ఉక్రెయిన్ ను లొంగదీసుకునేందుకు ప్రయత్నిస్తున్న మాస్కో ప్రభుత్వానికి.. ఉక్రెయిన్ బలగాలు ఛాలెంజ్ విసురుతున్నాయి. ఇప్పటికే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ రష్యాకు లొంగేదే లేదు అని ప్రకటన ఇచ్చారు. నిన్న మిమ్మల్ని మీరు కాపాడుకోవాటంటే.. ఉక్రెయిన్ వదిలిపోవాలంటూ.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఉక్రెయిన్ బలగాలతో పాటు.. సాధారణ ఉక్రెయిన్ పౌరులు కూడా యుద్ధంలో పాటుపంచుకుంటున్నారు. దీంతో రష్యా బలగాలకు విపరీతమైన ప్రతిఘటన ఎదురవుతోంది.
ఈరోజు ఉక్రెయిన్ నగరాలపై భారీగా దాడులు జరుపుతున్న రష్యా సేనలకు ఉక్రెయిన్ సేనల నుంచి అదే స్థాయిలో ప్రతిఘటన ఎదురవుతోంది. ఇప్పటి వరకు 5710 మంది రష్యన్ సైనికులను చంపడంతో పాటు 29 విమానాలను కూల్చినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది. ఇదే విధంగా 29 హెలికాప్టర్లు, 198 ట్యాంకర్లు, 846 సాయుధ శకటాలు, 305 వాహనాలు, 60 ఇంధన ట్యాంకులు, 07 డ్రోన్లను ధ్వంసం చేసినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది.