ఉక్రెయిన్, అమెరికా ఊహించినట్టుగానే జరిగింది. రష్యా మరోసారి తన దొంగబుద్ధి బయటపెట్టింది. ఉక్రెయిన్‌లో తాత్కాలిక కాల్పుల విరమణ ప్రకటించిన రష్యా .. గంటల్లోనే బాంబులతో విరుచుకుపడింది. తూర్పు ఉక్రెయిన్‌లోని క్రమాటోర్స్క్‌పై క్షిపణులతో దాడిచేసింది. 14కుపైగా ఇండ్లు ధ్వంసమైనట్లు స్థానిక మేయర్ హోంచరెంకో వెల్లడించారు. ఖైర్సన్‌లో జరిగిన దాడిలో ఒకరు మృతిచెందారని తెలిపారు.
కాల్పుల విరమణపై రష్యాను నమ్మడానికి వీల్లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఇప్పటికే ప్రకటించారు. అదనపు బలగాలను మోహరించేందుకుఏ విరామం తీసుకుంటున్నారని, దానికి కాల్పుల విరమణ అని పేరుపెట్టారని విమర్శించారు. ఉక్రెయిన్ ఊహించినట్టుగానే జరగడంతో రష్యాపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సుమారు 11 నెలలుగా జరుగుతున్న ఉక్రెయిన్-రష్యా యుద్ధానికి పుతిన్ తాత్కాలికి విరామం ప్రకటించారు. ఆర్ధడాక్స్ క్రిస్మస్ వేడుకల సందర్భంగా జనవరి 6న మధ్యాహ్నం 12 గంటల నుంచి జనవరి 7 అర్ధరాత్రి 12 వరకు 36 గంటల పాటు ఉక్రెయిన్‌పై ఎలాంటి దాడులు చేయొద్దని సైన్యాన్ని ఆదేశించారు. అయితే ఇది అమల్లోకి వచ్చిన గంటల్లోనే రష్యా దాడులకు దిగడం విశేషం.