ఉక్రెయిన్ పై రష్యా సాగిస్తున్న మారణహోమాన్ని ప్రపంచం అంతా ఖండిస్తోంది. ముఖ్యంగా బుచా నగరంలో రష్యా దురాగతాలపై యూరప్ తో సహా అమెరికా, చైనా, భారత్ ఖండించాయి. బుచా నగరంలో వందల మంది సాధారణ ఉక్రెయిన్ పౌరులను అతి దారుణంగా చంపేయడం ప్రపంచాన్ని కలవరానికి గురిచేసింది. ఈ ఘటనపై చైనా విచారణకు డిమాండ్ చేస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పటికే ఆర్థిక ఆంక్షలతో రష్యాను కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్న ప్రపంచ దేశాలు మరిన్ని ఆంక్షలు విధిస్తున్నాయి. రస్యాలోని అతిపెద్ద ఆర్థిక సంస్థ స్బేర్ బ్యాంక్, రష్యా అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ ఆల్ఫా బ్యాంక్ పై ఆంక్షలను విధించాయి. రష్యాలో కొత్త పెట్టుబడులను నిషేధించాయి యూరోపియన్ యూనియన్, అమెరికా, జీ7 దేశాలు. రష్యా నుంచి బొగ్గు దిగుమతులపై కూడా నిషేధం విధించాలని పలు యూరోపియన్ దేశాలు భావిస్తున్నాయి. ఈయూ దేశాల్లోని రేవుల లోకి రష్య నౌకలు, ఓడలు రానీవ్వకుండా తీర్మాణం చేశాయి. మరోవైపు ఐరాస హెచ్చార్సీ నుంచి రష్యాను బహిష్కరించేందుక నేడు ఓటింగ్ జరగనుంది.
రష్యాపై తీవ్ర ఆంక్షలు విధించిన యూఎస్, జీ7, ఈయూ
-