కొన్నేళ్ల నుండి కూడా ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేస్తుందని తెలుస్తూనే వుంది. అయితే ఇన్నాళ్ళకి తన వ్యూహాన్ని అమలు చేసింది. అయితే ఈ మేరకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంచలన ప్రకటన చేయడం జరిగింది. తూర్పు ఉక్రెయిన్‌పై సైనిక ఆపరేషన్ చేస్తున్నట్టు పుతిన్ తెలిపారు.
అయితే ఆయన ఉక్రెయిన్ విషయంలో ఎవరూ జోక్యం చేసుకోవద్దని అన్నారు. ఒకవేళ ఎవరైనా ఇన్వాల్వ్ అయితే ప్రతీకారం తీర్చుకుంటామని అన్నారు. పరోక్షంగా అమెరికా సహా నాటో దేశాలకు ఆయన హెచ్చరికలు పంపారు.
ఒకవేళ కనుక ఎవరైనా జోక్యం చేసుకుంటే ప్రతీకారం తీర్చుకుంటామని అన్నారు. అదే విధంగా ఉక్రెయిన్ వేర్పాటువాదులు లొంగిపోవాలని అన్నారు. వేర్పాటువాద ప్రాంతాల్లోని ప్రజలను రక్షించేందుకు సైనిక ఆపరేషన్ చేపట్టినట్టు ఆయన చెప్పారు. ఉక్రెయిన్‌ను నాటోలో చేర్చుకో రాదన్న తమ డిమాండ్‌ను అమెరికా, దాని మిత్ర దేశాలు విస్మరించాయని పుతిన్ ఆరోపించారు. అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు.
ఉక్రెయిన్‌ను ఎన్నడూ రష్యా స్వాధీనం చేసుకోదన్నారు. అలానే బెదిరింపులను రష్యా ఎప్పుడు కూడా సహించదన్నారు. ఒకవేళ కనుక రష్యా చర్యల్లో ఏ దేశమైనా జోక్యం చేసుకుంటే ఎప్పుడు చూడని స్థాయి లో పరిణామాలను ఉంటాయన్నారు. అలానే ఉక్రెయిన్ సైనికులు లొంగిపోతే వారిని సురక్షితంగా పంపుతామని కూడా చెప్పారు.