పంజాబ్ కింగ్స్ తో జరిగిన నిన్నటి మ్యాచ్ లో ఉమ్రాన్ మాలిక్ అద్భుత స్పెల్ తో ఇరగదీశాడు. చివరి ఓవర్ లో ఒక్క పరుగు కూడా ఇవ్వకుండానే మూడు వికెట్లు తీశాడు. మొత్తంగా నాలుగు వికెట్లు తీసిన ఈ స్పీడ్ స్టార్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. అంతేకాదు.. చివరి ఓవర్ లో మెయిడెన్ వేసిన నాలుగో బౌలర్ గా ఉమ్రాన్ రికార్డులకెక్కాడు. ఈ జాబితాలో ఉమ్రాన్ కంటే ముందు ఇర్ఫాన్‌పఠాన, లసిత్ మలింగ, జయదేవ్ ఉనద్కత్ ఉన్నారు.
కాగా.. పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ గ్రాండ్ విక్టరీని నమోదు చేసింది. కాగ తొలుత మొదటి రెండు మ్యాచ్ లు ఓడి నిరుత్సహ పర్చినా.. తర్వాత వరుసగా నాలుగు విజయాలను అందుకుంది. దీంతో పాయింట్ల పట్టికలో సన్ రైజర్స్ హైదరాబాద్.. నాలుగో స్థానంలోకి ఎగబాకింది. కాగ నేటి మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ ఇచ్చిన 152 పరుగుల టార్గెట్ ను సన్ రైజర్స్ బ్యాట్స్ మెన్లు.. సులువుగా చేధించారు.