నిన్న దాదాపుగా 8 గంటల పాటు మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీ ని నిర్వహించిన రామోజీరావును తన ఇంట్లోనే CID అధికారులు విచారణ చేశారు. అయితే ఈ విచారణలో భాగంగా కొన్ని కీలక విషయాలు మరియు ఆధారాలను సేకరించినట్లు తెలుస్తోంది. కాగా ఈ విషయంపై మజ రాజమండ్రి ఎంపీ మరియు అడ్వకేట్ ఉండవల్లి అరుణ్ కుమార్ తనదైన శైలిలో రెచ్చిపోయారు. ఈయన మాట్లాడుతూ రామోజీరావు మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీని తనకు ఇష్టం వచ్చినట్లు నడిపారన్నారు.
అయితే ఈ విషయంపై అప్పట్లో నేను మార్గదర్శిలో తప్పులు జరుగుతున్నాయని మాట్లాడానని నాపైనే తప్పుడు కేసులు పెట్టించి ఇబ్బంది పెట్టారన్నారు. అప్పటి నుండి నేను ఇదే విషయంపైన రామోజీరావు ను ఉద్దేశించి డిపాజిటర్ల పేర్లను ఒక పుస్తక రూపంలో విడుదల చేయమంటే చేయడే అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు. టీటీడీ మీదనే రూ. కోట్లు చెల్లించాలని ఫైన్ వేసిన ప్రభుత్వం మనది.. దేవుడికన్నా రామోజీరావు ఏమీ గొప్ప కాదు అంటూ మాట్లాడాడు.