కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎప్పుడు ఏదో ఒక కామెంట్ చేసి.. వివాదాలకు తెరలేపుతున్నారు. అయితే, తాజాగా ఈ వివాదాల కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ అరుదైన ఘనత సాధించారు. ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన వంద మంది మహిళల్లో చోటు సంపాదించారు.
ఆ జాబితాలో 36వ ర్యాంకును సొంతం చేసుకున్నారు. నిర్మలాసీతారామన్ వరుసగా నాలుగోసారి ఈ లిస్టులో చేరటం గొప్ప విషయం. 2019లో 34వ స్థానం, 2020లో 41వ ర్యాంక్, 2021లో 37వ స్థానం పొందారు. గత రెండేళ్లతో పోల్చితే ఈసారి ర్యాంకును మెరుగుపరుచుకున్నారు. ఈ సంవత్సరం మన దేశం నుంచి నిర్మలాసీతారామన్తోపాటు మరో ఐదుగురు ఈ వంద మందిలో ఉన్నారు.