కేసీఆర్ కు కేంద్ర మంత్రి ఫోన్…? ఎందుకు…?

-

తెలంగాణాలో కరోనా కేసుల నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సహాయం తీసుకుని ముందుకు వెళ్తుంది. ఇక తాజాగా సీఎం కేసీఆర్ కు ఫోన్ కు చేసిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్… రాష్ట్రంలో కరోనా పరిస్థితి గురించి ఆరా తీసారు. తెలంగాణ కు ప్రస్తుతం ఇస్తున్న 5500 రేమిడిసివర్ ఇంజక్షన్ల సంఖ్యను సోమవారం నుంచి 10,500 కు పెంచుతున్నట్టు సీఎం కు కేంద్ర మంత్రి వివరించారు.

200 టన్నుల ఆక్సిజన్ సరఫరా ను తెలంగాణ కు సరఫరా చేయాలని కేంద్రం నిర్ణయించినట్టు పీయూష్ గోయల్ వివరించారు. ఛత్తీస్ఘడ్, ఒరిస్సా , పశ్చిమ బెంగాల్ నుంచి తెలంగాణకు ఆక్సీజన్ వస్తుంది అని కేంద్రం తెలిపింది. హై కోర్ట్ సూచనల మేరకు తెలంగాణ కు ఆక్సిజన్ , రేమిడిసివర్ , వ్యాక్సిన్ల ను సత్వరమే సరఫరా చేయాలని ప్రధాని ఆదేశించిన నేపథ్యంలో నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర మంత్రి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news