ఊపిరితిత్తుల ఆరోగ్యానికి హెర్బల్ డ్రింక్స్…!

-

కరోనా వైరస్ కారణంగా ఊపిరితిత్తులు దెబ్బతింటున్నాయి. ఇటువంటి సమయంలో ఊపిరితిత్తుల ఆరోగ్యానికి మరియు హృదయ సంబంధిత సమస్యలు రాకుండా చూసుకోవాలి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం 92 శాతం ప్రజలు కలుషితమైన గాలిని పీల్చుకుంటున్నారు అని చెప్పింది.

ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఆహారం పట్ల శ్రద్ధ తీసుకోవాలి. ఊపిరితిత్తులు ఆరోగ్యం కోసం కొన్ని హెల్తీ టీలగురించి మీకోసం. వీటి వల్ల ఊపిరితిత్తుల ఆరోగ్యం బాగుంటుంది మరియు రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

ఆయుర్వేదం ప్రకారం వివిధ రకాల ఆహార పదార్థాల వల్ల రెస్పిరేటరీ సిస్టమ్ ఆరోగ్యంగా ఉంటుందని చెప్పడం జరిగింది. మరి హెర్బల్ టీ గురించి ఇప్పుడు ఎటువంటి ఆలస్యం లేకుండా చూసేద్దాం..

పసుపు నీళ్ళు లేదా పాలు:

ప్రతి రోజూ పసుపు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. పసుపులో యాంటి ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఊపిరితిత్తుల ఆరోగ్యానికి ఇది బాగా పనిచేస్తుంది. నాచురల్ గా స్ట్రాంగ్ గా ఉండేటట్టు చేస్తుంది. రోగనిరోధక శక్తి కూడా పెంపొందుతుంది. మీరు రోజు రాత్రి నిద్రపోయే ముందు పాలల్లో లేదా నీళ్లలో కొద్దిగా పసుపు వేసుకుని తీసుకోండి. దీనితో మీకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.

పిప్పర్మెంట్ తీ:

పిప్పర్మెంట్ టీ తాగడం వల్ల కూడా రెస్పిరేటరీ సమస్యలు తగ్గిపోతాయి. మ్యూకస్ ని ఇది క్లీన్ చేస్తుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా దీనిలో ఉంటాయి. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్స్ ని కూడా తొలగిస్తుంది.

అల్లం టీ:

అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. దగ్గు, జలుబు వంటి సమస్యలు కూడా ఇది తొలగిస్తుంది. కొద్దిగా నీళ్ళలో అల్లాన్ని మరిగించి చల్లారిన తర్వాత తీసుకుంటే చక్కగా ప్రయోజనాలు మీకు కలుగుతాయి. దీనిలోని పొటాషియం, మెగ్నీషియం మరియు జింక్ కూడా అధికంగా ఉంటుంది. ఇన్ఫెక్షన్స్ని కూడా ఇది తొలగిస్తుంది.

యాలుకల టీ:

యాలుకల టీ వల్ల కూడా లాభాలు ఎక్కువగా ఉన్నాయి. ఊపిరితిత్తుల ఆరోగ్యానికి బాగా పనిచేస్తాయి. జీర్ణ సమస్యలకు కూడా చెక్ పెడతాయి.

Read more RELATED
Recommended to you

Latest news