ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కి నైతిక విలువలు ఉండుంటే.. అరెస్ట్ అయినప్పుడే రాజీనామా చేసేవారని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నైతిక విలువలు ఉంటే.. అతనిపై అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడే రాజీనామా చేసేవారు అన్నారు. వాస్తవం తేలే వరకు జైలులోనే ఉండే వారని పేర్కొన్నారు. కానీ ఆయన అలా చేయలేదని మండిపడ్డారు.
వచ్చే ఎన్నికల్లో ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు రాజ్ నాథ్ సింగ్. అమెరికా పర్యటనలో ఉన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కూడా మండి పడ్డారు రాజ్ నాథ్. విదేశాలకు వెళ్లిన రాహుల్.. భారతదేశం ప్రతిష్ట ను దెబ్బ తీశారని పేర్కొన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ప్రజల్లో మాత్రం మోడీ ప్రభుత్వం పై విశ్వాసం పెరుగుతూనే ఉందని వెల్లడించారు. ఇవాళ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. త్వరలోనే అతిషిని లెప్టినెంట్ గవర్నర్ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించనున్నారు.