ఆకలితో చావాలి తప్ప.. ఆందోళన చెందొద్దంటూ పాట.. పాకిస్థాన్ ప్రధానిపై పరోక్ష విమర్శ

-

పాకిస్థాన్ పార్లమెంట్‌లో విశ్వాస పరీక్షలో నెగ్గి ఆ దేశ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఊపరి పీల్చుకున్నారు. అయితే విశ్వాస తీర్మానం అనంతరం మీడిమా ముందు మాట్లాడిన ఓ మాటను తీసుకుని ప్రముఖ సంగీత దర్శకుడు సాద్ అలావీ సెటైరికల్‌గా ఒక పాటను రాశారు. ఆ పాటను కంపోజ్ చేసి.. వీడియో కూడా తీశారు. ఈ పాటలో విద్య, ఆహారం, ఆరోగ్యం ఇలా అనేక రంగాల్లో పరిపాలన ఏ మాత్రం బాలేదంటూ లిరిక్స్ అందించారు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘‘ముందుగా మీరు కంగారు పడొద్దు’’ అంటూ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చెప్పిన వీడియో రికార్డుతో పాట మొదలవుతుంది. ఆ తర్వాత కంగారు పడొద్దు అనే పదాన్ని పాట మధ్య మధ్యలో రిపీట్ అవుతూ ఉంటుంది.

imrankhan

ఈ వీడియోను ప్రముఖ సంగీత దర్శకుడు సాద్ అలావీ రూపొందించారు. ఆ తర్వాత యూట్యూబ్ అకౌంట్‌తోపాటు ట్విట్టర్ అకౌంట్‌లో కూడా అప్లోడ్ చేశారు. ఇలా ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ‘‘ముందుగా మీరు కంగారు పడొద్దు.. ఆహారం లేకపోయినా కంగారు పడొద్దు.. పిల్లలు చదవకపోయినా కంగారు పడొద్దు, ఆరోగ్యం బాలేకున్నా కంగారు పడొద్దు.. ఏమీ లేకపోయినా కంగారు పడొద్దు.. ఆకలితో చావాలి తప్ప ఆందోళన చెందొద్దు’’ అంటూ ఈ పాట కొనసాగుతుంది.

ఇలాంటి రీమిక్స్ వీడియో పాటలు సోషల్ మీడియాలో ఎప్పుడు హిట్ అవుతూ వస్తున్నాయి. తాజాగా ఈ పాట కూడా ఆ జాబితాలో చేరింది. ఈ వీడియో లిరిక్స్‌కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. కొందరూ పాట ఎంతో ఫన్నీగా ఉందని కామెడీగా తీసుకుంటే.. మరికొందరూ వీడియోను సపోర్ట్ చేస్తూ షేర్ చేస్తున్నారు. వీడియో అప్లోడ్ చేసినప్పటి నుంచి కొన్ని లక్షల వ్యూస్ సంపాదించుకుంది. ఈ పాటను సాద్ అల్వీ యూట్యూబ్‌లో తన ఖాతాలో అప్లోడ్ చేశారు. దీనికి ‘ఆప్ నె ఘబ్‌రానా నహీ’ టైటిల్ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news