లైఫ్ లీడ్స్ ఫిలాసఫీ..బాలయ్య మాట్లాడితే వాటి స్థాయి పెరిగి తీరుతుంది.తాత్విక చింతనలో బాలయ్య మాట్లాడితే కొందరిపై అయినా అవి ప్రభావం చూపుతాయి.ఆహా షోలో మాటలు ఫిల్మ్ రైటర్ కమ్ డైరెక్టర్ బీవీఎస్ రవి రాశారు..వాటికి జీవం ఇచ్చింది బాలయ్యే !
బాలయ్య అంటే మాస్
మాస్ జాతర అలాంటి హీరో
మాట్లాడుతుంటే అదుర్స్
తోటివారిని నవ్విస్తూ
వారి జీవితాల గురించి వివరిస్తుంటే అదుర్స్
అందుకే అన్ స్టాపబుల్ హిట్ …అన్ ఎక్స్‌పెక్టెడ్ హిట్
నేను మీకు తెలుసు నా స్థానం మీ మనసు అన్న ఒకే ఒక్క డైలాగ్ బాలయ్య జీవితాన్ని మార్చేసింది. ఆహా (ఓటీటీ ప్లాట్ ఫాం ) జీవితాన్నే మార్చింది.నిజ జీవితంలో ఎలా ఉంటారో అదే బాలయ్య ఆన్ స్క్రీన్ పై ఆహా స్క్రీన్ పై..నేను ఏం మాట్లాడాలనుకుంటు న్నానో అదే మాట్లాడతాను నో డ్రామా నో టెన్షన్ అంటూ ఆహా షో అన్ స్టాపబుల్ ను రక్తి కట్టించారు. షో స్థాయిని ఒక్కసారి జాతీయ స్థాయిలో పెంచారు.ఓ టాక్ షో రేంజ్ ను అంతర్జాతీయ స్థాయికి తీసుకుని వెళ్లి తన కీర్తినీ తన ఖ్యాతినీ ఒక్కసారిగా పెంచుకున్నారు.
అనిపించింది అందాం..అనుకున్నది చేద్దాం.. ఎవడు ఆపుతాడో చూద్దాం..అని చెప్పారు బాలయ్య..ఈ డైలాగ్ ను బీవీఎస్ రవి రాశా రు.ఇటీవల ఆయన కొన్ని మంచి విషయాలు షో కు సంబంధించి చెప్పారు.అవేంటో చూద్దాం. ముందు షో అనుకున్నప్పుడు ఫస్ట్ గెస్ట్ మోహన్ బాబే అనుకున్నారట! ఆయన సీనియర్ అండి ఆయన వస్తేనే బాగుంటుంది.వారికి సముచిత స్థానం ఇచ్చిన వాళ్లం అవుతాం అని అన్నారు బాలయ్య..మోహన్ బాబు సీన్ లోకి ఎంటర్ కాగానే నవ్వులే నవ్వులు.. చిరంజీవి గురించి మోహన్ బాబు ఈ షో లో చెప్పిన మాటలు ఎందరినో ఆలోచింపజేశాయి..అంతటి స్థాయిలో బాలయ్య అనుకున్నది అనిపించింది అన్నీ కలిపి మాట్లాడారు..మాట్లాడించారు.. అదీ బాలయ్య రేంజ్..
రెండు మూడు ఎపిసోడ్లు అవుతుంటే బాలయ్య చిన్న కూతురిని పిలిచి చెప్పారు..ఆమె పేరు తేజస్విని..టాక్ షో లో మాటలు ఓవర్ ల్యాప్ అవుతున్నాయని..ఇయర్ టాక్స్ లో సజెషన్ కూడా ఇచ్చారు..ఇవన్నీ బాలయ్య ఫాలో అయ్యారు.నాని రాగానే చిన్న పిల్లాడయిపోయారు.రవి తేజ రాగానే సొంత తమ్ముడిలా చూసుకున్నారు..నేనమయినా మాట్లాడాలా ఎవ్వరితో అయినా ఫోన్లో.! చెప్పండి మీరేం చెబితే అది చేస్తాను అని చెప్పి మరీ! చేశారు..ఈ షో! ప్రపంచం నివ్వెర పోయేలా ఐఎండీబీ రేటింగ్ లో 9.7 పొంది ఔరా అనిపించారు.
బాలయ్యకు కోపం కానీ మనిషి మనస్తత్వం చాలా సున్నితం..అవును! బాలయ్యకు మనం ఏమయినా చెప్పొచ్చు.. ఏదయినా వింటారు.. ఆ షోకు పనికి వస్తుంది అనుకుంటే వెంటనే చేస్తారు..అందుకే బాలయ్య ను రిపీట్ చేయడం సులువు..బాలయ్యతో క్రియెటివ్ ఎఫెర్ట్ ఇచ్చి పనిచేయడం ఇంకా సులువు.. ఆయన డైరెక్టోరియల్ వ్యూ చాలా బాగుంటుంది..అందుకు బ్రహ్మానందంతో చేసిన ఎపిసోడే పెద్ద నిదర్శనం..ఆయన ఇంట్రడక్షన్ ను ప్లాన్ చేసిందే బాలయ్య.. పల్లకిలో ఆయనను తీసుకురండి అంటూ ప్లాన్ చేసిందే బాలయ్య..దటీజ్ బాలయ్య. సాహిత్యం బాగా తెలిసిన ఓ దిగ్గజ కవి బ్రహ్మానందం ఆయనను ఆ విధంగానే తీసుకురావాలి.కృష్ణ దేవరాయుల కాలంలో అష్ట దిగ్గజాలు ఎలానో మన ఇండస్ట్రీలో అలాంటి స్థాయి వారిది..అని చెప్పి మరీ! ఆయన ఇంట్రడక్షన్ షూట్ ప్లాన్ మొత్తం బాలయ్యే ఇచ్చారని బీవీఎస్ రవి చెప్పారు.
రాజమౌళి, సుక్కూ లాంటి డైరెక్టర్లు ఎందరొచ్చినా..! అవునండి మాతో సినిమా ఎప్పుడు అని మొహమా టం లేకుండా అడగగల ఏకైక స్టార్ హీరో..వాళ్లను మాట్లాడిస్తూ,నవ్విస్తూ,వారి జీవితంలో మంచి, చెడులు చెబుతూ ఈ షోతో బాలయ్య నేర్పిందెంతో! మాటలు మాత్రం రవి రాశారు వాటి ఇంప్రవైజేషన్ అంతా బాలయ్యే చేశారు. ఈ షో ఆరంభంలో చెప్పే లైఫ్ ఫిలాసఫీ అంతా బాలయ్యను దృష్టిలో ఉంచుకుని రాసిందే! ఆయన మాత్రమే చెప్పగలిగే మాటలవి..! కుటుంబం, బంధం, ప్రపంచం,గెలుపు, ఓటమి వీటికి తాత్విక లక్షణాలు జోడించి చెప్పడం రైటర్ చేస్తే, వాటి ఉన్నతి పెంచింది మాత్రం బాలయ్యే! వెంకీ రావాలి రాలేకపోయారు. నాగార్జున కు కుదరలేదు. చిరు మాత్రం వస్తారు త్వరలోనే! ఈ సీజన్ మహేశ్ బాబుతో ఎండ్ కానుంది..అంటూ రవి ఆసక్తిదాయక విషయాలు ఎన్నో చెప్పారు అవన్నీ ఈ వీడియోలో..