ఈబీసీ పథకానికి కేబినెట్‌ ఆమోదం..త్వరలోనే మహిళల అకౌంట్లో 45వేలు జమ !

-

అమ‌రావ‌తి : ఇవాళ ఏపీ కేబినేట్‌ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. అయితే… దాదాపు 2 గంటల పాటు సాగిన ఈ కేబినేట్‌ సమావేశంలో… పలు కీలక నిర్ణయాలకు జగన్‌ కేబినేట్‌ ఆమోద ముద్ర వేసింది. ముఖ్యంగా… ఈబీసీ నేస్తం ప‌థ‌కానికి ఆమోదం తెలిపిన ఏపీ కేబినెట్… ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు హౌసింగ్‌పై ఆమోదం తెలిపింది. ఉద్యోగుల రిటైర్మెంట్ వ‌య‌స్సు 62 ఏళ్ల‌కు పెంచుతూ నిర్ణ‌యం తీసుకున్న ఏపీ కేబినేట్… కోవిడ్‌ తో ప్రాణాలు కోల్పోయిన ఉద్యోగుల కుటుంబ స‌భ్యుల కారుణ్య నియామ‌కాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది.

కేబినెట్ నిర్ణయం పై మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. అగ్రవర్ణ మహిళలకు ఆర్థికంగా చేయూత నిచ్చేందుకు ఈనెల 25వ తేదీ నుంచి ఈ బీసీ నేస్తం పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు మంత్రి పేర్ని నాని తెలిపారు. ఇందుకోసం 550 కోట్లు విడుదల చేసేందుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు. 45 నిమిషాలు వాయిస్ సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న మహిళలు అర్హులని వివరించారు. ఈ పథకంలో భాగంగా ఏటా 15 వేల చొప్పున మూడేళ్లలో 45000 ఆర్థిక సహాయం చేయనున్నట్లు స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news