పెట్రో మంట‌లు ఆగేలా లేవు ? దండ యాత్ర

-

ఏపీలో రోడ్డు సెస్సు ఉంది. రూపాయి చొప్పున పెట్రో ఉత్ప‌త్తుల‌పై వ‌సూలు చేస్తున్న వైనం బాగుంది. పోనీ ఇలా వ‌సూలు చేస్తున్న డ‌బ్బును వీళ్లేం చేస్తున్నారు అంటే కేవ‌లం ఉచిత ప‌థ‌కాల‌కు డైవర్ట్ చేస్తున్నారు. పాల‌న‌లో అధికభాగం ఉచితాల‌కే వెచ్చిస్తే ఎంత ఆదాయం వ‌చ్చినా అది ఎందుకూ కొరగాదు. అవ‌సరం మేరకు అభివృద్ధి అన్న‌ది అస్స‌లు పాటింపులో లేని వ్య‌వ‌హారం. రోడ్ల మ‌రమ్మ‌తుల‌కు రెండు వేల కోట్ల రూపాయ‌లు వెచ్చిస్తామ‌ని, సంక్రాంతి త‌రువాత రోడ్డు ప‌నులు ప్రారంభం అవుతాయి అని ఊద‌రగొట్టిన వైసీపీ త‌రువాత ఆ ఊసే ఎత్త‌డం లేదు. ప‌న్నుల పేరిట వ‌సూళ్లు బాగానే ఉన్నా కూడా నిధులు లేవ‌ని అప్పులే దిక్కు అవుతున్నాయ‌ని వైసీపీ ప‌దే ప‌దే చెప్ప‌డం వెనుక ఉన్న ఆంత‌ర్యం ఏంటో ?

దేశ వ్యాప్తంగా పెట్రో ధ‌ర‌లు ఓ లెక్క ఏపీలో మ‌రో లెక్క. ఇతర రాష్ట్రాల‌తో పోలిస్తే పెట్రో ధ‌ర‌లు ఇక్క‌డ భ‌గ్గుమంటున్నాయి. అయినా కూడా రాష్ట్రం త‌న వాటా కింద త‌గ్గించుకోవాల్సిన సెస్సుల‌ను కానీ ప‌న్నుల‌ను కానీ అస్స‌లు త‌గ్గించుకోవ‌డం లేదు. దీంతో ధ‌ర గ‌రిష్టంగా కుప్పంలో 119 రూపాయ‌ల 698 పైస‌లుగా ఉంది. అదేవిధంగా డీజిల్ ధ‌ర 105 రూపాయ‌ల 18 పైస‌లుగా ఉంది. ప‌ది రోజుల్లో తొమ్మిది సార్లు పెట్రో ఉత్ప‌త్తుల ధ‌ర‌లు పెంచిన రీత్యా వినియోగ‌దారులు ల‌బోదిబో అంటున్నారు. తొలి ఆరు నెల‌ల్లోనే అద‌న‌పు రాబ‌డి 2 వేల 731 కోట్ల రూపాయ‌లు అని తేలింది. దీంతో ఏం చేయాలో తోచక కొంద‌రు వాహ‌నాల వినియోగానికి వీలున్నంత మేర స్వ‌స్తి చెబుదామ‌ని చూస్తున్నారు.

పెట్రో ధ‌ర‌ల నియంత్ర‌ణ అన్న‌ది ఇక సాధ్య‌మా కాదా అని ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్ని స్తున్నారు. రాష్ట్ర ప‌న్ను వ్యాట్ రూపంలో పెట్రోలు పై 31 శాతం ఉంది. అదేవిధంగా డిజిల్ పై 22.5 శాతం ఉంది. అద‌న‌పు వ్యాట్ పెట్రోల్ మ‌రియు డీజిల్ పై నాలుగు రూపాయ‌లుగా ఉంది. రోడ్డు సెస్సు పేరిట రెండింటిపై రూపాయి చొప్పున అద‌నంగా వ‌సూలు చేస్తున్నారు. ఇంత చేస్తున్నా ఏపీలో రోడ్లు బాగుప‌డ‌వు. అదేవిధంగా కాలువ‌లు మ‌ర‌మ్మ‌తుల‌కు నోచుకోవు. కనీస సౌక‌ర్యాలు గ్రామాల‌కు చేర‌వు.

Read more RELATED
Recommended to you

Latest news