టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వైఫ్ ఉపాసన కొణిదెల ఇటీవల ‘ఆర్ఆర్ఆర్ ’ చిత్ర విడుదల సందర్భంగా చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. హైదరాబాద్ లోని కూకట్ పల్లి భ్రమరాంబ థియేటర్ లో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం చూస్తూ పేపర్లు గాలిలోకి విసిరి ఆనందపడిపోయింది. కాగా, ఆమె ఆనందం తాజాగా మరింత రెట్టింపయింది. అపోలో హాస్పిటల్స్ చైర్ పర్సన్‌గా ఉన్న ఉపాసన కొణిదెల ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నారు. ఈ మేరకు ఆమె ఇన్ స్టా గ్రామ్ వేదికగా పోస్టు పెట్టగా, మెగా అభిమానులు, నెటిజన్లు కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు.
ఉపాసన అపోలో హాస్పిటల్స్ ఫౌండేషన్ ద్వారా నిత్యం హ్యుమన్ లైఫ్, వైల్డ్ లైఫ్ కోసం కృషి చేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే నాట్ హెల్త్ సీఎస్‌ఆర్ అవార్డు వరించింది. గ్రామీణా ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు అపోలో హాస్పిటల్స్ ఫౌండేషన్ చేస్తున్న కృషికి గుర్తింపుగా ఈ ఏడాది పురస్కారాన్ని అందుకున్నారు. ఆ పురస్కారంతో దిగిన ఫొటోను ఇన్ స్టా వేదికగా పంచుకుంది ఉపాసన.
ఈ సందర్భంగా ఇన్ స్టా వేదికగా పెట్టిన పోస్టులో తనను గొప్ప కార్యక్రమంలో భాగం చేసిన తన తాత, అపోలో ఆస్పత్రుల ఫౌండర్, చైర్మన్ అయిన డాక్టర్ ప్రతాప్ సి.రెడ్డికే ఈ అవార్డు చెందుతుందని పేర్కొంది. గ్రామీణాభివృద్ధిలో భాగంగా వైద్య సేవలను మెరుగుపర్చాలనేది ప్రతాప్ సి.రెడ్డి లక్ష్యమని, ఆయనే తనకు స్ఫూర్తి ప్రదాతని తెలిపింది. ఈ సంగతులు పక్కనబెడితే..ఒక పక్కన తన భర్త రామ్ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ ఫిల్మ్ తో దేశవ్యాప్తంగా ప్రేమను పొందుతుండగా, మరో వైపున ఉపాసనకు తన కెరీర్ లో గుర్తుండిపోయే పురస్కారం రావడం నిజంగా గొప్ప విషయమని మెగా అభిమానులు అనుకుంటున్నారు.
https://www.instagram.com/p/CbuJyY4h9_3/?utm_source=ig_web_copy_link