మెగా అభిమానులకు అప్డేట్‌.. వాల్తేర్‌ వీరయ్య నుంచి వీడియో

-

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి హైప్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు బాబీ తెరకెక్కిస్తుండగా, పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా ఈ సినిమాను చిత్ర యూనిట్ రూపొందిస్తోంది. ఈ సినిమాలో చాలా రోజుల తరువాత మెగాస్టార్ ఊరమాస్ అవతారంలో కనిపిస్తున్నాడు. ఇక ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ టీజర్, పార్టీ సాంగ్ ఇప్పటికే ఈ సినిమాపై నెలకొన్న అంచనాలను అమాంతం పెంచేశాయి. అయితే తాజాగా చిత్ర యూనిట్‌ ఈ సినిమాలో స్పెషల్‌ సాంగ్‌ గురించి అప్డేట్‌ ఇచ్చింది.

దీనికి సంబంధించిన మేకింగ్‌ వీడియోను రిలీజ్‌ చేసింది మైత్రీ మూవీమేకర్స్‌. ఈ వీడియోలో చిరు వాయిస్ ఓవర్ పాట చిత్రీకరణకు సంబంధించిన విషయాలు వెల్లడించారు. అంతేకాకుండా లాస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్ చేస్తున్నట్లు, దానికి సంబంధించిన లీక్ చేస్తున్నట్లు చిరు చెప్పారు.  ఈ సినిమాలో శృతిహాసన్‌ చిరు సరసన నటించనుంది. ఇదిలా ఉంటే.. రవితేజ ఇందులో ఏసీపీ విక్రమ్‌సాగర్‌ పాత్రలో కనిపిస్తుండగా… ఫస్ట్‌ లుక్‌ టీజర్‌ ఇప్పటికే నెట్టింట్లో హల్‌ చల్ చేస్తోంది. కాగా వాల్తేరు వీరయ్యలో రవితేజ షూటింగ్‌ పార్టుకు సంబంధించిన స్టిల్స్ ను మైత్రీ మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇపుడు ఈ స్టిల్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. డైరెక్టర్ బాబీ, ఫైట్‌ మాస్టర్లు రామ్‌-లక్ష్మణ్‌ పర్యవేక్షణలో యాక్షన్‌ సీన్‌ షూట్‌ చేస్తున్నపుడు తీసిన స్టిల్స్ సినిమా ఎలా ఉండబోతుందో చెబుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news