హుస్సేన్ సాగర్ లో కొబ్బరి నీళ్ళు ఎక్కడున్నాయి : ఉత్తమ్

-

జిహెచ్ఎంసి ఎన్నికల నగారా మోగింది. ప్రస్తుతం అన్ని పార్టీలు తీవ్ర స్థాయిలో ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్న విషయం తెలిసిందే. కాగా టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వం పై విమర్శలు గుప్పించారు. ప్రజలను ఆకర్షించి ఓట్లు రావడం కోసం టిఆర్ఎస్ ప్రభుత్వం అబద్ధపు హామీలు ఇస్తుంది అంటూ విమర్శించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్రజలు టిఆర్ఎస్ మేనిఫెస్టో చెత్తబుట్టలో వెయ్యాలి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

గత జిహెచ్ఎంసి ఎన్నికల్లోనే టిఆర్ఎస్ ఎన్నో హామీలు ఇచ్చి నిలబెట్టుకోలేకపోయింది అంటూ విమర్శించారు. హుస్సేన్ సాగర్ లో మురికి నీరు తొలగించి కొబ్బరి నీళ్లలా హుస్సేన్ సాగర్ నీళ్లు మారుస్తాను అని కెసిఆర్ హామీ ఇచ్చారని.. హామీ ఏమైంది అంటూ ప్రశ్నించారు. అంతేకాకుండా సెలూన్ లను ఉచిత విద్యుత్.. డబుల్ బెడ్ రూమ్.. హైదరాబాద్ లో ఉచిత వైఫై.. నాలాల ఆధునీకరణ లాంటి హామీలు ఇచ్చిన కెసిఆర్ ఇప్పుడు మరిచిపోయారు అంటూ విమర్శించారు. ఎంతో చరిత్ర కలిగిన నిమ్స్ పరిస్థితిని అధ్వాన స్థితికి తెచ్చారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news