చంద్రబాబు ఎలాంటోడంటే…. సంచలనంగా మారిన జూ.ఎన్ఠీఆర్ మామ వ్యాఖ్యలు

-

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నె శ్రీనివాసరావు…. చంద్రబాబు రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన పాత వీడియో ఒకటి వైరల్ గా మారింది.చంద్రబాబు వల్ల ఆయన సొంత కుటుంబ సభ్యులు ఎన్నో ఇబ్బందులు పడ్డారని, వారు పూర్తిగా దూరం చేయబడ్డారనే కామెంట్లు ఇప్పటికీ వినిపిస్తున్న నేపథ్యంలో… జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నె శ్రీనివాస్ గతంలో ఇదే విషయాలపై వ్యాఖ్యానిస్తూ, సంచలన వ్యాఖ్యలు చేసిన ఓ వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇందులో… చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మొదటి నుంచీ నమ్మదగిన వ్యక్తి కాదని.. సొంత తమ్ముడినే మోసం చేశాడని నార్నె శ్రీనివాస్ ఈ వీడియోలో వ్యాఖ్యానించారు.

సొంత తమ్ముడికే చంద్రబాబు టిక్కెట్ ఇవ్వలేదని చెప్పిన నార్నె శ్రీనివాసరావు… ఆయన పరిస్థితి చాలా దారుణంగా ఉందని.. చంద్రబాబు తమ్ముడిని గొలుసులు, తాళ్లతో కట్టేస్తున్నారని నాడు కీలక విషయాలు వెల్లడించారు! అదే సమయంలో.. చంద్రబాబుకు ధమ్మూ, ధైర్యం ఉంటే తన తమ్ముడిని తీసుకొచ్చి ప్రజల ముందు ప్రవేశపెట్టాలని, తాను ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నట్లు శ్రీనివాస్ ఆ వీడియోలో స్పష్టం చేశారు. ఇదే క్రమంలో… చంద్రబాబు నాయుడు కోవర్టులను తయారు చేసి, పక్కపార్టీల్లోకి పంపించి, వాళ్లతో జిమ్మిక్కులు చేస్తున్నారని.. అదేవిధంగా… ప్రజల్లో ఎటువంటి ఆసక్తి లేనప్పటికీ గారడీలు చేస్తూ, మోసాలు చేస్తూనే చంద్రబాబు ఎన్నికల్లో గట్టెక్కుతున్నాడని ఆరోపించారు.ఇదే సమయంలో… సొంతబలం మీద గెలిచే సత్తా ఏనాడూ చంద్రబాబుకు లేదని, గెలవలేరని సంచలన వ్యాఖ్యలు చేశారు.

తిరుపతిలో చంద్రబాబు సొంత చెల్లెల్లుకు యాక్సిడెంట్ జరిగితే.. ఆమె పరిస్థితి చాలా దారుణంగా ఉండి, హైదరాబాద్ కు షిఫ్ట్ చేసి ట్రీట్ మెంట్ ఇప్పిస్తే.. చంద్రబాబు కానీ, ఆయన సతీమణి కానీ, నారా లోకేష్ కానీ పలకరించలేదని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే… సొంత చెల్లెలు అలాంటి పరిస్థితుల్లో ఉంటేనే చూడని చంద్రబాబు… రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా మేలు చేస్తారనేది ప్రజలే తేల్చుకోవాలని నార్నె శ్రీనివాస్ నాడు స్పష్టం చేశారు.

ఇప్పుడు ఎన్నికల సమయంలో ఆ ఓల్డ్ వీడియో మరోసారి తెరపైకి వచ్చింది. ఇలా.. సొంత చెల్లెలు తమ్ముడి విషయంలో చంద్రబాబు వైఖరి ఎంత దారుణంగా ఉందనే విషయాలు చెబుతూ గతంలో నార్నె శ్రీనివాస్ చేసిన తీవ్ర విమర్శలకు సంబంధించిన వీడియో ఇప్పుడు తెరపైకి రావడం, అది కాస్త నెట్టింట వైరల్ గా మారడం తీవ్ర చర్చనీయాంశం అవుతుంది.

ఎన్నికల వేళ ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ సమయంలో ఆసక్తికర విషయాలు తెరపైకి వస్తున్నాయి. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నె శ్రీనివాసరావుకు సంబంధించిన పాత వీడియో ఒకటి వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news