ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా ఆసక్తికర సన్నివేశాలు జరుగుతున్నాయి. ఇప్పటికే అన్ని సర్వేలు యూపీలో మళ్లీ బీజేపీనే అధికారాన్ని చేపడుతుందని చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎస్పీ నాయకులు మాత్రం మాకు ఎగ్జిట్ పోల్స్ సర్వేలపై నమ్మకం లేవని చెబుతున్నాయి.
ఇదిలా ఉంటే ఇప్పుడు సమాజ్ వాదీ పార్టీ నాయకులు ఈవీఎం స్ట్రాంగ్ రూములపై నిఘా పెట్టారు. స్ట్రాంగ్ రూంలపై నిఘా పని భద్రతా సిబ్బందిది కదా… అనే డౌట్ మీకు రావచ్చు. అయితే స్ట్రాంగ్ రూముల వద్ద బీజేపీ ఎలాంటి దుర్వినియోగ పనులు చేయకుండా ముందస్తు జాగ్రత్తగా మేము నిఘా ఉంటున్నామని ఎస్పీ నేతలు అంటున్నారు. మీరట్ జిల్లాలోని హస్తినాపూర్ నియోజకవర్గం నుంచి ఎస్పీ పార్టీ అభ్యర్థి యోగేష్ వర్మ.. ఈవీఎం స్ట్రాంగ్ రూంల వద్ద బైనాక్యులర్ తో నిఘా ఉన్నాడు.
ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ లు, దాని చుట్టు ఉన్న ఇతర కదలికలపై నిఘా ఉంచాలని ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ మమ్మల్ని ఆదేశించారని ఆయన చెబుతున్నారు. మేము8 గంటల మూడు షిప్టుల్లో పని చేస్తున్నట్లు వెల్లడించారు. ఎగ్జిట్ పోల్స్ పై మాకు నమ్మకం లేదని .. అఖిలేష్ సీఎం అవుతారని.. మేమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని.. మాకు సంపూర్ణ మెజారిటీ వస్తుందని ఎస్పీ లీడర్ యోగేష్ వర్మ అన్నారు.
#WATCH | Samajwadi Party candidate from Hastinapur constituency in Meerut district, Yogesh Verma keeps an eye on EVM strong room with binoculars to prevent mishandling pic.twitter.com/0eB8FO4vQO
— ANI UP/Uttarakhand (@ANINewsUP) March 8, 2022