డెల్ నుంచి జి7 15 7500 ల్యాప్‌టాప్‌.. ధ‌ర ఎంతంటే..?

-

ప్ర‌ముఖ కంప్యూట‌ర్స్ ఉత్ప‌త్తుల త‌యారీదారు డెల్ భార‌త్‌లో కొత్త‌గా జి7 15 7500 పేరిట ఓ ల్యాప్‌టాప్‌ను విడుద‌ల చేసింది. ఇందులో ఇంటెల్ కోర్ 10వ జ‌న‌రేష‌న్ ప్రాసెస‌ర్‌, ఎన్‌వీడియా జిఫోర్స్ ఆర్‌టీఎక్స్ గ్రాఫిక్స్ కార్డ్‌, ఫాస్ట్ రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే, 1టీబీ వ‌ర‌కు ఎస్ఎస్‌డీ త‌దిత‌ర అద్భుత‌మైన ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు.

Dell G7 15 7500 laptop launched in india

డెల్ జి7 15 7500 ల్యాప్‌టాప్‌లో ఇంటెల్ కోర్ ఐ9 10వ జ‌న‌రేష‌న్ ప్రాసెస‌ర్ ల‌భిస్తుంది. ఎన్‌వీడియా జిఫోర్స్ ఆర్‌టీఎక్స్ 2060 గ్రాఫిక్స్ కార్డ్‌ను ఏర్పాటు చేశారు. అందువ‌ల్ల గ్రాఫిక్స్ అద్భుతంగా వ‌స్తాయి. అలాగే ఈ ల్యాప్‌టాప్ డిస్‌ప్లే 300 హెడ్జ్ వ‌ర‌కు రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది. అందువ‌ల్ల పిక్చ‌ర్ క్వాలిటీ అద్భుతంగా ఉంటుంది. అలాగే గేమ్స్ స్మూత్‌గా ఆడుకోవ‌చ్చు. 1 టీబీ వ‌ర‌కు ఎస్ఎస్‌డీని ఇందులో పొంద‌వ‌చ్చు. 6 సెల్ 86 వాట్ అవ‌ర్ బ్యాట‌రీ ఇందులో ఉంది. అందువ‌ల్ల బ్యాక‌ప్ ఎక్కువ‌గా వ‌స్తుంది.

డెల్ జి7 15 7500 ల్యాప్‌టాప్ ధ‌ర రూ.1,61,990గా ఉంది. దీన్ని ఫ్లిప్‌కార్ట్‌తోపాటు డెల్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్‌ల‌లో విక్ర‌యిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news