ఆంధ్రావని జిల్లాల ఏర్పాటుతో ఉత్తరాంధ్ర సేఫ్.. కానీ ఇక్కడ నుంచి కష్టాలు అయితే మొదలు కావడం ఖాయం. ఇప్పటికే పాలనలో ఎన్నో తప్పిదాలు ఉన్నా అవేవీ నివృత్తికి నోచుకోవడం లేదు. అపరిష్కృత సమస్యలు పరిష్కృతం కావడం లేదు. ఈ దశలో కొత్త జిల్లాల ఏర్పాటు అంటూ స్పీచులు దంచుకుంటూ పోతున్న వైసీపీ నాయకులు రేపటి వేళ క్షేత్ర స్థాయిలో సమస్యలు ఏ విధంగా పరిష్కరిస్తారో ?
అప్పులో అప్పు.. చేసేయ్యడమే!అసలు ఉన్న జిల్లాలలో పాలనే ఎంతో అస్తవ్యస్తంగా ఉంది. అలాంటిది కొత్త జిల్లాలు తెరపైకి వచ్చి ఏం చేస్తాయి అన్న ప్రశ్న కూడా ఉంది. అయినా కూడా వాటిని పట్టించుకునే స్థితిలో ఇవాళ జగన్ లేరు. అభ్యంతరాలు ఎలా ఉన్నా కూడా తాను ఏం అనుకున్నానో అదే చేసి తీరుతారు.ఆ విధంగా జగన్ తాజాగా తీసుకురానున్న కొత్త జిల్లాల ఏర్పాటు ఏ మేరకు విజయవంతం కానున్నాయో అన్నది ఓ ఆసక్తిదాయక పరిణామం.
కొత్త జిల్లాల ఏర్పాటుపై ఇప్పటి నుంచి కొన్ని ప్రతిపాదనలు, సన్నాహాలు ముమ్మరం అయ్యాయి. ఈ క్రమంలో కొత్త కార్యాలయాల ఏర్పాటు, శాఖలకు సంబంధించి పని విభజన, సిబ్బంది విభజన వంటి వాటిపై అధికారులు దృష్టి సారిస్తున్నారు. ముఖ్యంగా ఉగాది నుంచే ప్రతిపాదిత జిల్లాలు అమల్లోకి రానున్నాయి కనుక వీటిపై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించి పునర్విభజన కమిటీ క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ ప్రజల అభ్యంతరాలు వింటోంది. పెద్దగా ఈ ప్రాంతంలో ఉద్యమాలు ఏవీ లేవు కానీ అధికారులు రేపటి వేళ కార్యాలయాల ఏర్పాటు, పని విభజన, సిబ్బంది విభజన ఏ విధంగా చేస్తారో అన్న డైలమా మాత్రం అందరిలోనూ ఉంది.
జిల్లాల ఏర్పాటు కారణంగా పెద్దగా ప్రయోజనాలు ఏమీ ఉండవు కానీ కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవచ్చు అన్న ఆశలో భాగంగా జగన్ కొత్త జిల్లాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు అన్నది తేలిపోయింది. కార్యాలయాల ఏర్పాటు అన్నది ఆర్థిక భారం, ఇందుకు యాభై కోట్ల రూపాయల వరకూ ఖర్చు ఉంటుంది. కొందరైతే 120 కోట్ల వరకూ కూడా ఖర్చు ఉంటుందని అంటున్నారు.అయినా సరే జగన్ ఖర్చుకు వెనకాడబోం అంటున్నారు కానీ ఆ పాటి మొత్తాలకు కూడా అప్పే దిక్కు. ఇప్పటికే అప్పులతో నెట్టుకు వస్తూ నెగ్గుకు రాలేకపోతున్న జగన్ కు ఈ కొత్త అప్పు అవసరమా? అన్న ప్రశ్న జనం నుంచి వస్తోంది.
జిల్లాల ఏర్పాటు కన్నా రెవెన్యూ డివిజన్లను కొత్త ఏర్పాటు చేస్తే చాలు అని చాలా మంది ఎప్పటి నుంచో చెబుతున్నారు. ఇప్పటికిప్పుడు కొత్త జిల్లాల ఏర్పాటుతో పాలన అస్తవ్యస్తంగా తయారవ్వడం ఖాయం.ఇప్పటికే వైసీపీ అడ్మిన్ లెవల్ లో ఎంత పూర్ గా ఉందో అందరికీ తెలిసిందే! ఇకపై అస్తవ్యస్తతను నివారించడం ఎలానో అన్నది తెలియక అధికారులు తలలు పట్టుకోవడం ఖాయం. పాలనలో అనుభవ శూన్యత కారణంగా ఎన్నో తొందరపాటు నిర్ణయాలు తీసుకున్న జగన్ ఈ సారి మరో తొందరపాటు చర్యకు తావిచ్చి నవ్వుల పాలు కానున్నారు అన్నది విపక్షం నుంచి వస్తున్న ఆందోళన.