తెలంగాణ వ్యాప్తంగా చిన్నారులకు డిప్తీరియా నిరోధక టీడీ టీకాల పంపిణీ..

-

ధనుర్వాతం, కంఠసర్పి వ్యాధుల నుంచి పిల్లలకు రక్షణ కల్పించే వ్యాక్సిన్ ను రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ చేయాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా నవంబరు నెల 19 తేదీ వరకు 12 రోజులు పాటు ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా అన్ని జిల్లాల్లో చేపట్టనున్నారు.

విద్యార్థులకు టీడీ వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. 5-10 తరగతి చదువుతున్న విద్యార్థులకు వ్యాక్సిన్ ఇచ్చేందుకు ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 5-10 తరగతి చదువుతున్న చిన్నారులు 8 లక్షల దాకా ఉంటారని వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు టిడిపి వ్యాక్సిన్ వేస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news