15-18 ఏళ్ల పిల్లలకు వ్యాక్సిన్‌.. ఈ సర్టిఫికేట్‌ తీసుకెళ్లాల్సిందే !

-

ఒమిక్రాన్‌ కేసులపై మంత్రి హరీష్‌ రావు కీలక ప్రకటన చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు, ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయన్నారు. గత వారంలో పాజిటివిటీ రేట్ నాలుగు రెట్లు పెరిగిందని… 15 నుంచి 18 ఏళ్ల పిల్లలకు కో-వ్యాక్సిన్ ఇస్తున్నామని ప్రకటన చేశారు. తెలంగాణ రాష్ట్రం తరపున కేంద్రాన్ని బుస్టర్ డోస్ గురించి చాలా కాలంగా కోరామని.. నాలుగు వారాల వ్యవధిలో పిల్లలకు 2వ డోస్ టీకా ఇస్తామన్నారు. తల్లి తండ్రులు లేక ఉపాధ్యాయుల సమక్షంలో టీకాలు అందిస్తామని…12 కార్పొరేషన్ లలో ఆన్లైన్, ఇతర ప్రాంతాల్లో వాక్ ఇన్ పద్దతిలో టీకాలు ఇస్తామన్నారు.

నాలుగు రోజుల తరువాత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆన్లైన్ రేజిస్ట్రేషన్ పై మరో మారు నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. వ్యాక్సిన్ తీజుకుంటే జ్వరం వస్తుందనే అపోహ వద్దని…బర్త్ సర్టిఫికెట్, ఆధార్ కార్డ్, కాలేజి ఐడి కార్డ్ ఉన్న సరిపోతుందని వెల్లడించారు. ప్రభుత్వ ప్రైవేట్ కేంద్రాల్లో టీకాలు వేస్తారని… 1014 ప్రభుత్వ కేంద్రాల్లో పిల్లలకు టీకాలు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. అన్ని కాలేజీల యాజమాన్యాలు, ప్రధాన ఉపాధ్యాయులు , తల్లి దండ్రులు పిల్లల వాక్సినేషన్ బాధ్యత తీసుకోవాలని తెలిపారు. కాలేజీలో ప్రతి విద్యార్థి టీకా తీసుకునేలా అధ్యాపకులు బాధ్యత తీసుకోవాలన్నారు. ఖైరతాబాద్ ఆసుపత్రిని త్వరలో మరింత విస్తరించి ప్రారంభం చేస్తామని ప్రకటన చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news