డిసెంబర్ లో వస్తుంది, కాదు జనవరి లేదా ఫిబ్రవరి, లేదు వేసవి సమయానికి వచ్చేయొచ్చు… ఇండియాలో కరోనా వ్యాక్సిన్ కి సంబంధించి ఇలా ఎన్నో ప్రకటనలు వస్తూనే ఉన్నాయి. కరోనా వ్యాక్సిన్ కి సంబంధించి ఇప్పుడు మరో ప్రకటన వచ్చింది… రెగ్యులేటరీ సంస్థల నుండి ఆమోదాలు సకాలంలో అమల్లోకి వస్తే జనవరి నాటికి భారతదేశంలో ఒక కరోనా వైరస్ వ్యాక్సిన్ లభిస్తుందని సీరం సీఈఓ అదార్ పూనావల్లా చెప్పారు.
ఆదర్ పూనవల్లా సారధ్యంలోని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన ‘కోవిషీల్డ్’ అనే కరోనావైరస్ వ్యాక్సిన్ ఉత్పత్తి కోసం ఆస్ట్రాజెనెకాతో ముందుకు వెళ్తుంది. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో, అదార్ పూనవల్లా మాట్లాడుతూ… అన్ని ఆమోదాలు అమల్లో ఉంటే 2021 జనవరి నాటికి భారతదేశంలో కరోనావైరస్ వ్యాక్సిన్ లభిస్తుందని భావిస్తున్నామని ఆయన అన్నారు.