దేశ వ్యాప్తంగా వ్యాక్సిన్ విషయంలో ప్రజలు నానా బాధలు పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరితో రాష్ట్రాలు కూడా ప్రజలకు వ్యాక్సిన్ ఇవ్వలేక సమస్యలు ఎదుర్కొంటున్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా పరిస్థితి అదే విధంగా ఉంది. వ్యాక్సిన్ కోసం హైదరాబాద్ ప్రజల అవస్థలు అన్నీ ఇన్ని కాదు. సెకండ్ డోస్ కోసం పక్క జిల్లాలకు పరుగులు పెడుతున్నారు. గ్రేటర్ లోని కేంద్రాల్లో టీకా స్లాట్లు దొరకడం లేదు.
ప్రయాణానికి అనువైన ప్రాంతాల్లో వ్యాక్సిన్ కోసం బుకింగ్ చేసుకున్నారు. మేడ్చల్, యాదాద్రి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో స్లాట్ బుక్ చేసుకుంటున్నారు. రెండో డోస్ కు గడువు ముగుస్తుండటంతోనే పక్క జిల్లాలకు టీకా కోసం వెళుతున్నారు. అయితే టీకా సమర్ధవంతంగా అందుబాటులో లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇబ్బందులు పడుతుంది.