ధాన్యం కొనుగోలు వ్యవహారంపై మరోసారి టీపీసీసీ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి ఫైరయ్యారు. మెడ మీద కత్తి పెట్ట కేంద్రం ధాన్యం కొనుగోలు ఒప్పందంపై సంతకం పెట్టించుకుందని చెబుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్… మెడ మీద కత్తి పెడితే నీ పదవిని వదులుకుంటావా..? అని ప్రశ్నించారు. నీకొడుకును మంత్రి పదవిని నుంచి, మీ కూతురు, అల్లుడిని పదవుల నుంచి తొలగిస్తావా..? అని విమర్శించారు. కేంద్రం నీ అవినీతిపై విచారణ చేస్తామన్నారా..? సహారా కుంభకోనంలో జైలుకు పంపిస్తామన్నారా..? కాళేశ్వరం అవినీతిపై విచారణ చేస్తారని భయపడ్డారా…? అందుకు మెడమీద కత్తి పెడితే రైతుల ప్రయోజనాలను వదిలేశారా అని సీఎం కేసీఆర్ ను రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు ఒప్పందం చేసుకుని అదానీ, అంబానీలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రైతుల ప్రయోజనాలను సీఎం కేసీఆర్, మోదీలు తాకట్టు పెడుతున్నారు.
రైతుల పండించిన పంటను కేంద్రం కొనకుంటే రాష్ట్రమే కొనుగోలు చేయాలని అన్నారు. కేంద్రం చేతులెత్తేసినప్పుడే కదా మీ పని తనం తెలిసేది అని సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి అన్నారు. మీకు చేతకాకపోతే సీఎంగా కొనసాగే అర్హత లేదని విమర్శించారు రేవంత్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంట విధానం ఏముందో .. స్పష్టం చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. టీఆర్ఎస్, బీజేపీ పార్టీల వల్లే పసుపు రైతులను మోసం చేశారని.. పత్తి రైతులు పురుగుల మందులు తాగుతున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఖమ్మంలో రైతులకు బేడీలు వేసిన చరిత్ర నీదని కేసీాఆర్ను విమర్శించారు.