వాలెంటైన్స్ డే అనేది పక్షుల సంభోగ కాలం అనుకునేవారట.. మీకు తెలుసా..?

-

ఫిబ్రవరి 14 అంటే మనకి గుర్తు వచ్చేది వాలెంటైన్స్ డే. వాలెంటైన్స్ డే నాడు చాలా మంది ప్రేమికులు ఒకటవుతారు. అలానే వాలెంటైన్స్ డే నాడు ప్రేమికులు వాళ్ళ ప్రేమను వ్యక్త పరుస్తారు. చాలా మంది వాలెంటైన్స్ డే నాడు వివాహం కూడా చేసుకుంటారు. పెళ్లయిన భార్యాభర్తలు కూడా వాలెంటైన్స్ డే ని సెలబ్రేట్ చేసుకుంటారు. ప్రపంచంలోనే వివిధ ప్రాంతాలలో వేరువేరు పేర్ల తో వాలెంటైన్ డే ని జరుపుకుంటారు.

సెయింట్ వాలెంటైన్స్ డే, సెయింట్ వాలెంటైన్ విందు ఇలా జరుపుతారు. అలానే వాలెంటైన్స్ డే నాడు మాల్స్ లో కూడా ప్రేమతో డెకరేషన్ చేయడం వంటివి చేస్తారు. అయితే చాలామందికి తెలియని విషయం ఏమిటంటే శతాబ్దాల మార్పుల తర్వాత ఆధునిక వాలెంటైన్స్ డే గా మారింది. ఇప్పుడు అయితే వాలెంటైన్స్ డే వ్యాపారంలా మారిపోయింది.

సెయింట్ వాలెంటైన్ బలి దానం మీద కూడా కథలు వున్నాయి. మూడవ శతాబ్దం లో రోమన్ సామ్రాజ్యం కింద ఖైదు అయ్యాడు. చాలా హింసించబడేవాడు అని స్టోరీ కూడా వుంది. అలానే ఇంకో కథ ప్రకారం సెయింట్ వాలెంటైన్ ఉరి తీయబడటానికి ముందు యువర్ వాలెంటైన్ అని అమ్మాయికి రాసాడు. ఇలా వాలెంటైన్ డే గురించి చాలా కథలు వున్నాయి.

అయితే ఇప్పుడు వాలెంటైన్ డే నాడు ప్రేమించిన వ్యక్తి కి వాళ్ళ ప్రేమ గురించి చెబుతున్నారు. ఇదిలా ఉంటే మధ్య యుగాల లో అయితే ఇంగ్లండ్, ఫ్రాన్స్ వంటి యూరోపియన్ దేశాలు పక్షులకు
సంభోగం కాలం ప్రారంభమైన రోజు అని నమ్మేవాళ్ళట. ప్రేమతో దీన్ని అనుబంధించారు.
వెంటనే శృంగార వేడుకలను మొదలు పెట్టేవారు. 17వ శతాబ్దంలో ప్రపంచవ్యాప్తంగా మరింత ప్రజాదరణ పొందింది.

Read more RELATED
Recommended to you

Latest news