తెలుగుదేశం పార్టీ ఇప్పుడు విజయవాడలో పలు సమస్యలను ఎదుర్కొంటోంది. ప్రధానంగా పార్టీలో ఉన్న కొంతమంది సీనియర్ నేతలు పార్టీని ఇబ్బంది పెడుతున్నారనే ఆవేదన కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. రాజకీయంగా చంద్రబాబునాయుడు కొన్ని కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకోవడంతో కార్యకర్తల్లో కూడా ఇప్పుడు ఒక రకమైన ఆందోళన వ్యక్తమవుతోంది.
అయితే ఇప్పుడు విజయవాడలో ఉన్న సీనియర్ నేతలు పార్టీకి సహకరించటం లేదు అనే భావన విజయవాడ టీడీపీ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. వైసీపీ నేతలతో కలిసి పార్టీని ఇబ్బంది పెడుతున్నారని వైసీపీ నేత ఒకరు ముగ్గురు టీడీపీ నేతలతో పార్టీని ఇబ్బంది పెట్టే విధంగా రాజకీయం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కామెంట్లు వస్తున్నాయి. విజయవాడ ఎంపీ కేశినేని నాని తో ముందు నుంచి కూడా ఆ ముగ్గురు నేతలకు కూడా చాలా వరకు ఇబ్బందులు ఉన్నాయి.
అందుకే ఇప్పుడు విజయవాడలో టీడీపీ ఓటమి ముగ్గురు సహకరిస్తున్నారని ఈ విషయం అధిష్టానానికి తెలిసినా సరే అధిష్టానం సైలెంట్ గా ఉందని విజయవాడలో సామాజిక వర్గాల్లో చీలిక తీసుకువచ్చే విధంగా ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నారని అది వైసీపీ కలిసి వచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అలాగే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వంటి వారి సహకారంతో ఇప్పుడు విజయవాడలో టిడిపి నేతలు ముందుకు వెళ్తున్నారు అంటూ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కామెంట్ వస్తుంది. అయితే ఈ విషయాలన్నీ చంద్రబాబుకి తెలిసినా ఆయన పట్టించుకోవడం లేదంటూ కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.