కెసిఆర్ ముందు చంద్రబాబు పొర్లుదండాలు పెడుతూనే ఉండాలి : వల్లభనేని వంశీ సంచలన ట్వీట్

చంద్రబాబుకు టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కౌంటర్ ఇచ్చారు. ట్విట్టర్ వేదికగా చంద్రబాబు పై విమర్శలు గుప్పించారు వల్లభనేని వంశీ. “చంద్రబాబూ… నేను కేసీఆర్ గారికి పొర్లు దండాలు పెడుతున్నానన్నావు… నిజమే. మరి నువ్వు ? కేసిఆర్ గారి ముందు మోకాలిదండేసి పొర్లు దండాలు పెడుతూనే ఉన్నావు. ఓటుకు నోటు కేసు తేలే వరకు అంతేగా …!” అంటూ సంచలన ట్వీట్ చేశారు వంశీ.

చంద్రబాబు … నిజమే… నేను విశ్వాసఘాతుకుడనే… అది నీ ఒక్కడికే మాత్రమేనని పేర్కొన్నారు. కానీ చంద్రబాబు మాత్రం… ఇందిరాగాంధీ గారికి, మహానుభావుడు ఎన్ టి ఆర్ , హరికృష్ణ , దగ్గుబాటి గార్లు, పెద్దలు మోడీ , అమిత్ షా గార్ల అందరికీ కు నమ్మకద్రోహివి, వెన్నుపోటుదారుడివి , విశ్వాసఘాతుకుడివంటూ ఓ రేంజ్ లో రెచ్చిపోయారు వల్లభనేని వంశీ. అంతేనా కాంగ్రెస్ , టీడీపీ , బీజేపీ, కమ్యూనిస్టు పార్టీలు, టి ఆర్ ఎస్ , జనసేన పార్టీ లకు నమ్మక ద్రోహి అంటూ చంద్రబాబు పై ఫైర్ అయ్యారు వల్లభనేని వంశీ. వెన్నుపోట్లకు, నమ్మకద్రోహాలకు , విశ్వాసఘాతుకాలకు నిఖార్సయిన పేటెంట్ దారుడు చంద్రబాబేనని సంచలన వ్యాఖ్యలు చేశారు.