Breaking : మహిళను ఢీకొట్టిన వందేభారత్‌ ట్రైన్‌

-

ఇటీవల ప్రధాని ప్రారంభించిన వందేభారత్‌ ట్రైన్‌ వరుస ప్రమాదాలకు గురవుతోంది. వందేభారత్‌ ట్రైన్ ఓ మహిళను ఢీ కొట్టడంతో మృతి చెందింది. గుజరాత్‌లోని ఆనంద్ ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది. ఆనంద్ రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు దాటుతున్న ఓ 54 ఏళ్ల మహిళను ముంబయి వెళ్తున్న సెమీ హైస్పీడ్ రైలు వందే భారత్ ఎక్స్ప్రెస్ ఢీ కొట్టింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందినట్లు రైల్వే పోలీసులు వెల్లడించారు. మృతురాలు అహ్మదాబాద్ కు చెందిన బీట్రైస్ ఆర్కిబాల్డ్ పీటర్‌గా రైల్వే పోలీసులు గుర్తించారు. మంగళవారం సాయంత్రం సుమారు 4.37 గంటల సమయంలో ట్రాక్ దాటుతుండంగా ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు.

Woman run over by Vande Bharat train near Anand in Gujarat | Deccan Herald

మృతురాలు ఆనంద్లోని ఓ బంధువు వద్దకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. అయితే గాంధీనగర్ క్యాపిటల్ స్టేషన్ నుంచి ముంబయి సెంట్రలు వెళ్తున్న రైలుకు ఆనంద్ స్టాప్ లేదని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు తదుపరి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. కాగా, వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు ఇటీవల తరచూ ప్రమాదానికి గురవుతోంది. అక్టోబరు 6న ముంబయి నుంచి గాంధీనగర్కు వెళ్తున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు గుజరాత్లోని వత్వా, మణినగర్ రైల్వే స్టేషన్ల మధ్య నాలుగు గేదెలను ఢీకొట్టింది. ఈ ఘటనలో రైలు ముందు ప్యానెల్ దెబ్బతిన్నది. అది జరిగిన మరుసటిరోజే ఆనంద్ సమీపంలో ఓ ఆవును సైతం ఢీకొట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. కొద్దిరోజులకు మరో రైలు.. పశువులను ఢీకొట్టింది.

Read more RELATED
Recommended to you

Latest news