ఎన్నికల్లో నిహారిక పోటీ.. స్పందించిన వరుణ్ తేజ్

-

ఏపీలో ఓవైపు ఎన్నికల హడావిడి ప్రచారం నడుస్తున్న వేళ.. మరోవైపు మెగా హీరో వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలంటైన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మార్చి 01న ఆపరేషన్ వాలంటైన్ సినిమా విడుదల కానుండగా.. ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచింది చిత్ర యూనిట్. ఇవాళ రాజమండ్రిలో పర్యటించిన హీరో వరుణ్ తేజ్.. సినిమా విషయాలతో పాటు ఎన్నికల్లో ప్రచారం.. వచ్చే ఎన్నికల్లో తన కుటుంబ సభ్యుల పోటీ పై ఓ క్లారిటీ ఇచ్చారు.

ఎన్నికల్లో పోటీ పై మా కుటుంబంలో పెద్దవాళ్ల నిర్ణయమే మా నిర్ణయం అన్నారు వరుణ్ తేజ్. ఎన్నికల్లో మా కుటుంబంలో పెద్దవారి నిర్ణయమ ఫైనల్ అని చెప్పారు. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన వరుణ్.. పెద్దనాన్న చిరంజీవి, నాన్న నాగబాబు, బాబాయ్ పవన్ కళ్యాణ్ ఏది చెబితే అదే చేస్తామన్నారు. మా అవసరం ఉన్నది అనుకుంటే ఎన్నికల ప్రచారానికి వస్తామని స్పష్టం చేశారు. అంతేకాదు.. మా కుటుంబం అంతా బాబాయ్ పవన్ కళ్యాణ్ వెంటే ఉంటామని చెప్పుకొచ్చారు. మేము పొలిటికల్ గా ఏం చేయాలనుకున్నా పెద్ద నిర్ణయం ప్రకారమే నడుచుకుంటామని వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news