వాస్తు ప్రకారం అనుసరిస్తే పాజిటివ్ ఎనర్జీ వచ్చి నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా దూరం అయ్యి పోతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఫాలో అయితే ఏ ఇబ్బంది కూడ ఉండదు. పైగా ఎలాంటి సమస్య కి అయినా సరే పరిష్కారం వస్తుంది. ఇంట్లో ఆవు దూడ విగ్రహాన్ని పెట్టేటప్పుడు సరైన దిక్కున ఉంచితే మంచి కలుగుతుంది. ఇవి ఆనందాన్ని తీసుకు వస్తాయి.
అలానే సమస్యలు తొలగించుకోవడానికి కూడా వీటితో సాధ్యం అవుతుంది. ఇంట్లో మీరు ఆవు దూడ విగ్రహాన్ని ఉంచితే ఎటు వైపు ఉంచాలి అనేది చూస్తే.. ఆవు దూడ విగ్రహాన్ని ఈశాన్యం వైపు ఉంచితే మంచిది. దీని వల్ల అంతా శుభమే కలుగుతుందని గుర్తుంచుకుని ఆ విధంగా అనుసరించండి. అలానే వాస్తు శాస్త్రం ప్రకారం ఏదైనా మెటల్ తో తయారు చేసిన ఆవు దూడ పెట్టుకుంటే మంచిదని తెలుస్తోంది. కాబట్టి ఇటువంటి వాటిని ఇంట్లో ఉంచండి.
ఒకవేళ కనుక వాటిని కొనుగోలు చేయలేక పోతే ఆవు దూడ ఫోటోనైనా ఉంచుకోవచ్చు. ఇంట్లో ఆవు దూడ విగ్రహాలని ఉంచడం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఉండవు కనుక ఈ విధంగా మీరు ఇంట్లో ఉంచి మంచిని పొందండి సమస్యలన్నిటికి కూడా దూరంగా వుండండి పాజిటివ్ ఎనర్జీ వచ్చి నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా దూరం అయ్యి పోతుంది.