వాస్తు: మంచి రిలేషన్ షిప్ లో ఉండాలంటే వీటిని కచ్చితంగా పాటించాల్సిందే…!

-

వాస్తు ప్రకారం అనుసరిస్తే ఎంతో మంచి కలుగుతుంది. నెగటివ్ ఎనర్జీ దూరం అయ్యి పాజిటివ్ ఎనర్జీ దూరం అవుతుంది. పైగా చాలా మంది వాస్తు ప్రకారం వారి ఇంట్లో సామాన్లని సర్దుకుంటూ వుంటారు. వాస్తుకు విరుద్ధంగా ఏమైనా సామాన్లు ఉంటే మంచి జరగదని, ఆదాయం తగ్గిపోతుందని, ధన నష్టం కలుగుతుందని, చెడు జరుగుతుందని భవిస్తూ ఉంటారు. అందుకనే వాస్తు ప్రకారం అనుసరించి మంచిని పొందేందుకు చూస్తున్నారు. అయితే ఈ రోజు వాస్తు పండితులు మనకి రిలేషన్ షిప్ కి సంబంధించిన కొన్ని విషయాలను చెప్పారు. మరి వాటి కోసం ఈరోజు తెలుసుకుందాం.

చాలామంది రిలేషన్షిప్ లో ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ ఉంటారు. అయితే వాస్తు ప్రకారం మీ రిలేషన్షిప్ బాగుండాలంటే ఉత్తరం వైపు కూర్చుని మాట్లాడుకోవడం మంచిది. ఉత్తరం వైపు ఉండి మాట్లాడుకోవడం వలన బంధం దృఢంగా మారుతుంది.
అలానే వాస్తు శాస్త్రం ప్రకారం భార్యాభర్త అద్దానికి ఎదురుగా ఉండకూడదు అద్దానికి ఎదురుగా నిద్రపోవడం చెయ్యద్దు. దీని వలన మూడో వ్యక్తి రిలేషన్ షిప్ లోకి వస్తున్నట్లు అర్థం అని పండితులు చెప్తున్నారు కాబట్టి ఈ తప్పును కూడా అసలు చేయకండి.
ఎప్పుడూ కూడా సూర్యకాంతి ఉండేటట్టు చూసుకోండి మీరు ఉండే చోట సూర్య కాంతి పడడం వలన మీ రిలేషన్షిప్ పాజిటివ్ గా ఉంటుంది ఆనందం కలుగుతుంది ప్రశాంతంగా ఉండొచ్చు. నెగటివ్ ఎనర్జీ దూరమవుతుంది.
అలానే ఆకర్షణంగా మీ బెడ్ రూమ్ ని ఉంచుకోవడం వలన మంచి వైబ్రేషన్స్ కలుగుతాయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.
రొమాంటిక్ గా ఉండే బొమ్మలు జంట పక్షులు వంటి వాటిని పెట్టుకోవచ్చు.
మీరు దేవుడి ఫోటోలని బెడ్ రూమ్ లో ఉంచుకోకూడదు.
ఎప్పటికప్పుడు గదిని శుభ్రంగా ఉంచుకోవాలి అప్పుడు రిలేషన్షిప్ చాలా బాగుంటుంది.
మీ రూమ్ లో ఉండే లైట్ కూడా మీ రిలేషన్షిప్ పై ఎఫెక్ట్ చూపిస్తుంది కనుక భార్య భర్తలు మంచి రిలేషిప్ ని పొందడానికి ఈ తప్పులు చేయకుండా చూసుకోండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version