ఏపీలో ఇంతకాలం టీడీపీకి ఆడింది ఆట పాడింది పాటగా సాగింది యవ్వారం! కేంద్రంలో బీజేపీలోకి కొందరు టీడీపీ నేతలను పంపండం.. ఏపీ టీడీపీలో అధ్యక్షుడిని గ్ర్రిప్ లో పెట్టుకోవడం వంటి పనులతో… టీడీపీకి ఎలాంటి ఇబ్బందులూ లేకుండానే సాగింది ఇంతకాలం. అయితే… ఎప్పుడైతే సోము వీర్రాజు అధ్యక్ష బాధ్యతలు అందుకున్నారో… నాటినుంచి ఏపీలో టీడీపీకి అన్నిరకాలుగానూ కష్టాలు మొదలయ్యాయని అంటున్నారు విశ్లేషకులు. తాజాగా సుజనా చౌదరి కి కూడా వీర్రాజు షాక్ ఇచ్చారని అంటున్నారు!
టీడీపీ అధినేత చంద్రబాబు కు హస్తినలో రైట్ హ్యాండ్ లా పని చేసే సుజనా చౌదరికి ఏపీ బీజేపీ అధ్యక్షుడు వీర్రాజు షాకిచ్చారని అంటున్నారు. ఏపీలో టీడీపీ పడుతున్న ఇబ్బందుల గురించో.. హస్తిన నుంచి అందాల్సిన సపోర్ట్ గురించో తెలియదు కానీ… సోము వీర్రాజు అపాయింట్ మెంట్ కోసం సుజనా చౌదరి తెగ ప్రయత్నాలు చేస్తున్నారంట. ఇందులో భాగంగా అమిత్ షా నుంచి ప్రయత్నాలు కూడా చేశారంట. అయితే… ప్రస్తుతం అమిత్ షా కరోనా బారిన పడటంతో ఆ అవకాశం లేకుండా పోయిందని అంటున్నారు.
ఇక చేసేది ఏమీ లేక… తానే స్వయంగా వీర్రాజు అపాయింట్ మెంట్ కోసం ప్రయత్నించారంట సుజనా చౌదరి. అయితే… సుజానా చౌదరికి అపాయింట్ మెంట్ ఇవ్వడంలో వీర్రాజు అనాసక్తి ప్రదర్శించారని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో సుజనా కు ఊహించని అవమానం జరిగిందని అంటున్నారు! బాబు పరిస్థితి అలా ఉంటే.. సుజనా చౌదరి పరిస్థితి ఇలా అయ్యిందంటే.. ఇక రానున్న రోజుల్లో వీర్రాజు వీరంగం ఏపీలో టీడీపీ నేతలను ఒక ఆట ఆడుకునే అవకాశాలున్నాయని అంటున్నారు విశ్లేషకులు!