పవన్ కళ్యాణ్ ఒక టెర్రరిస్ట్..జనసేన పార్టీని మూసేయాలని మాజీ మంత్రి వెల్లంపల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ గ్లాస్ ఎప్పుడో పగిలింది..తన పార్టీ కార్యకర్తల లను నమ్మలేని వ్యక్తి పవన్ కళ్యాణ్ అని విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ మూసేయలి..పవన్ కళ్యాణ్ టీడీపీలో మంచి పదవి తీసుకోవాలని సూచించారు.
పార్టీ కార్యకర్తలను, అభిమానులను చంద్రబాబుకు అమ్మేస్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ అని.. పవన్ కళ్యాణ్ దమ్ము వుంటే రా… నేను బ్రాహ్మణ వీధిలో వుంటా… చూసుకుందాం రా అంటూ సవాల్ విసిరారు. పవన్ కళ్యాణ్ పై కేసు నమోదు చేయాలని కోరుతున్నాను.. పవన్ కళ్యాణ్ ఒక టెర్రరిస్ట్ అని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఖబడ్దార్ అని హెచ్చరించారు వెల్లంపల్లి.