హుజూరాబాద్ నియోజకవర్గంలో బీజేపీ ఘన విజయం సాధించింది. ప్రస్తుతం ఈవిజయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకుల్లో ఆత్మవిశ్వాసం రెట్టింపు అయింది. బలమైన అభ్యర్థి దొరికితే గెలుపు సాధ్యం అన్న రీతిలో బీజేపీ లెక్కలు వేసుకుంటోంది. అయితే వచ్చే రెండేళ్ల తర్వాతే సాధారణ ఎన్నికలకు సమయం ఉంది. కానీ ఈ లోగా వేముల వాడ ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని బీజేపీ పార్టీ భావిస్తోంది. దీన్ని బలపరుస్తు నిన్న జరిగిన ఓ టీవీ డిబెట్ లో తమ నెక్ట్స్ టార్గెట్ వేముల వాడే అని బీజేపీ నేత, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు చెప్పారు. దీంతో రానున్న కొన్ని రోజుల్లో వేముల వాడ ఎన్నికలు ఉండొచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం వేములవాడ ఎమ్మెల్యేగా టీఆర్ఎస్ పార్టీ తరుపున చెన్నమనేని రమేష్ ఉన్నారు. అయితే చెన్నమనేని పౌరసత్వం కేసుపై ప్రస్తుతం సుప్రీం కోర్్టలో విచారణ జరుగుతోంది. చెన్నమనేని రమేష్కు జర్మనీ పౌరసత్వం ఉందని.. అతను ఎన్నికలకు అనర్హుడని గతంలో కోర్టుల్లో పిటీషన్లు దాఖలయ్యాయి. 2018 ఎన్నికల్లో చెన్నమనేని రమేష్ గెలుపు తర్వాత కాంగ్రెస్ అబ్యర్థి ఆది శ్రీనివాస్ కోర్ట్ లో పిటీషన్ దాఖలు చేశారు. దీంతో చెన్నమనేని పౌరసత్వం కేసు తీర్పు అతనికి వ్యతిరేఖంగా వస్తే తెలంగాణలో మరో ఉప ఎన్నికకు తెర లేస్తుంది.