మ‌న రూపాయి విలువ 54,113.63 బొలివర్స్‌.. ఆరు సున్నాలు త‌గ్గించిన వెనిజులా

-

కరెన్సీలో మార్పులు ద్రవ్యోల్బణాన్ని బేస్‌ చేసుకుని మారుస్తుంటారు. అయితే, ఈ మార్పు స్వల్పంగానే ఉంటుంది. కానీ, అరుదుగా మార్పు ఆశ్చర్యభరితంగా ఉంటుంది. ఈ మార్పు ఎక్కడ చోటు చేసుకుంది? ఏంటో ఆ వివరాలు తెలుసుకుందాం.

inr to venezuela bolivar | inr to bolivar

వెనిజులా కరెన్సీ బొలివర్‌. దీని విలువ చాలా తక్కువకు దిగజారింది. ఎంతంటే రూ.10 లక్షలను ఏకంగా ఒకటికి తగ్గించేశారు. దీన్ని అధికారికంగా ఆ దేశ సెంట్రల్‌ బ్యాంకు తాజాగా ప్రకటించింది. అక్టోబర్‌ 1 నుంచి ఇది అమలులోకి వస్తుందని తెలిపింది. దీంతో బొలివర్‌ విలువ ఆరు సున్నాలు తగ్గిపోయినట్లైంది. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకే వెనిజులా బొలివర్‌ విలువ భారీ సవరణకు పూనుకుంది. ఇలా కరెన్సీ విలువలో మార్పులు చేయడం ఇది మూడోసారి. 2008 లో హుగో చావెజ్‌ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆ మార్పు జరిగింది. అప్పుడు మూడు సున్నాలను తగ్గించింది. ఆ తర్వాత 2018లో నికోలస్‌ అధ్యక్షుడిగా ఉన్నపుడు ఐదు సున్నాలను తగ్గించేసింది.

ఆహార ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో ఆ దేశంలోని లక్షలాది మంది పేదరికంలో కూరుకుపోయారు. డాలర్‌తో పోలిస్తే బొలివర్‌ విలువ అతి తక్కువ ఉండడంతో వెనిజులా ప్రజలకు అతి తక్కువ దినసరి జీతాలు వస్తున్నాయి. మరోవైపు రాజకీయ అనిశ్చితి కూడా దీనికి మరో కారణం. ప్రస్తుతం బొలివర్‌ విలువ ఎంతలా పడిపోయిందంటే.. 5 లీటర్ల నీటి బాటిల్‌ కొనేందుకు 7.4 మిలియన్‌ బొలివర్లను ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇది కేవలం 1.84 అమెరికా డాలర్లతో సమానం.

ఈ నేపథ్యంలో ఆరు సున్నాలు తగ్గిస్తే ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తుందని వెనిజులా ప్రభుత్వం ఆశిస్తోంది. ఒకప్పుడు చమురు ఎగుమతులతో ధనిక దేశంగా వెలుగొందిన వెనిజులా ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటోంది.

dollar to INR

Read more RELATED
Recommended to you

Exit mobile version