పార్టీలు మారడం మంచి పద్ధతి కాదు : వెంకయ్య నాయుడు

-

ప్రజాస్వామ్య దేశంలో పార్టీలు మారడం మంచి పద్ధతి కాదని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. ఈ యంగ్ ఇండియాకు యువతే ప్రాణధారమని.. అందుకే నేటి యువత రాజకీయాలవైపు మొగ్గు చూపాలని సూచించారు. అవినీతి, అక్రమాలు లేని నవసమాజాన్ని నిర్మించడంలో యువత భాగం కావాలని చెప్పారు.

గుంటూరులోని విజ్ఞాన్ వర్సిటీలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనానికి వెంకయ్యనాయుడు హాజరయ్యారు. ఈ ఆత్మీయ సమావేశంలో చిరకాల మిత్రులు, శ్రేయోభిలాషులు, ఆత్మీయులను కలవడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. చక్కని కార్యక్రమాన్ని నిర్వహించిన మిత్రులకు అభినందనలు తెలిపారు.

ప్రపంచం అంతా భారత్‌ వైపు చూడటానికి కారణం ప్రధాని నరేంద్రమోదీ అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. భారత్‌ స్నేహం కోసం ప్రపంచదేశాలు ఎదురుచూస్తున్నాయని తెలిపారు.  ‘‘నాయకులు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటున్నారో అర్థం కావడం లేదు. పార్టీలు మారడం ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు. రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలకు పోవడం.. కులమతాల ఆధారంగా నాయకులను ఎన్నుకోవడం సరైన పద్ధతి కాదు’’ అని వెంకయ్యనాయుడు అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news