Samantha: సామ్‌కు తిరుగేలేదు.. శాకుంతలం మూవీ రికార్డుల‌ను తిర‌గ‌రాస్తుంది.. వేణు స్వామి

-

వేణు స్వామి గురించి నెటిజ‌న్స్‌కి ప‌రిచ‌యం అక్క‌ర‌లేని పేరు, నాగ చైత‌న్య‌, స‌మంత వివాహం కాక‌ముందే వీరి పెళ్ళి పెటాకుల‌వుతుంద‌ని చెప్పిన వ్య‌క్తి. ఇప్పుడు మ‌రోసారి జ్యోతిశాస్త్ర ప్ర‌కారం స‌మంత భ‌విష్య‌త్తును చెప్పాడు.

గుణశేఖర్ దర్శకత్వంలో పాన్ ఇండియా పౌరాణిక చిత్రమైన శాకాంతలం సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సినిమా అధికారికంగా ప్రకటించిన రెండు నెలలకే ఆమె విడాకులు తీసుకోవడం సర్వత్రా చర్చలకు దారి తీసింది.. ఇక ఏది ఏమైనా సమంత మొదటిసారి పౌరాణిక చిత్రమైన శాకుంతలం సినిమాలో నటిస్తున్నట్లు ప్రకటించి , అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది . ఇక పోతే ఈ సినిమాలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ కూడా భరతుడి చిన్నప్పటి పాత్రలో నటించి మెప్పించింది అనే వార్తలు కూడా బాగా వైరల్ అవుతున్నాయి. ఇక దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నా.. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన ఎటువంటి అప్డేట్ ఇవ్వకపోవడం గమనార్హం.

అంతేకాదు ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా జరుపుకకుంటోందని, అందుకే విడుదలకు సిద్ధంగా లేదని చిత్రం యూనిట్ గతంలో చెప్పిందే తప్ప ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోవడం పై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి సమంత నటించిన శాకుంతలం సినిమా గురించి జ్యోతిష్యం చెప్పాడు. వేణు స్వామి మాట్లాడుతూ స‌మంత 2024 వరకు తన హవాను కొనసాగిస్తుంది.. అప్పటివరకు అగ్రతారగా కొనసాగుతుంది .. ఆమెను ఢీకొట్టే వారు ఎవరు రారు.. ఈమె నటించిన శాకుంతలం సినిమా సినీ కెరీర్ లోనే ఒక అద్భుతమైన చిత్రంగా మిగిలిపోతుంది. ఈ సినిమా రానున్న రోజుల్లో సమంతకు మరింత ఖ్యాతిని తీసుకొస్తుంది అంటూ తెలిపాడు. ఇకపోతే ఈ సినిమాకు నిర్మాతగా గుణశేఖర్ కూతురు నీలిమ గుణ నిర్మాణ బాధ్యతలు చేపట్టారు.

ఇక సమంత ఇంకొక పాన్ ఇండియా మూవీ అయినటువంటి యశోద సినిమాలో కూడా నటిస్తోంది. లేడీ ఓరియంటెడ్ చిత్రమైన ఈ సినిమాలో ఈమె యాక్షన్స్ సన్నివేశాలలో కూడా పాల్గొన్నట్లు సమాచారం. ఇక మరొకవైపు శివ నిర్మాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ తో ఖుషి సినిమాలో నటిస్తోంది. ఇక ఈ సినిమా కూడా పాన్ ఇండియా మూవీ కావడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news