చిత్ర పరిశ్రమలో విడాకులు అనేవి కామన్ అయిపోయాయి. ఇప్పటికే చాలా మంది స్టార్ హీరోలు, నటీ, నటులు విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో సమంత-అక్కినేని నాగచైతన్య విడాకుల టాపిక్ గా నడుస్తున్న నేపథ్యంలో.. మరో జంట విడిపోయేందుకు సిద్ధం అయింది.
సినీ ఇండస్ట్రీలో మరో హీరో విడాకులకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ‘బిచ్చగాడు’ ఫేమ్ విజయ్ ఆంటోనీ తన భార్య ఫాతిమాకు విడాకులు ఇవ్వబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. విజయ్ చేసిన ట్వీట్ ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది. ‘కుటుంబంలో ఏమైనా సమస్యలు ఉంటే మీరే పరిష్కరించుకోండి. కానీ మధ్యలోకి మూడో వ్యక్తిని రానివ్వకండి’ అని ట్వీట్ చేశాడు. 2006లో విజయ్, ఫాతిమాను పెళ్లి చేసుకోగా ఆమె సినీ నిర్మాత. వీరికి లారా అనే కూతురు ఉంది.