రౌడీ హీరో క్లాసీ లుక్స్..విజయ్ దేవరకొండ ఫొటోలు వైరల్

-

యూత్ ఫేవరేట్ స్టార్ విజయ్ దేవరకొండ..‘‘పెళ్లి చూపులు’’ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత విజయ్-సందీప్ రెడ్డి వంగ కాంబోలో వచ్చిన ‘‘అర్జున్ రెడ్డి’’ ఫిల్మ్ ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది.

ఈ చిత్రంతో విజయ్ దేవరకొండ‌కు ఉన్న అమ్మాయిల ఫాలోయింగ్ బాగా పెరిగింది. ప్రజెంట్ విజయ్ దేవరకొండ పాన్ ఇండియా స్టార్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఆయన నటించిన ‘‘లైగర్’’ చిత్రం పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కానుంది.

ఇకపోతే సోషల్ మీడియాలో చాలా తక్కువ కనిపించే విజయ్ లేటెస్ట్ గా తన ఇన్ స్టా గ్రామ్ లో తన ఫొటోలు షేర్ చేశాడు. నలుపు రంగు సూట్ ధరించి స్టన్నింగ్ లుక్స్‌తో అదరగొడుతున్నారు. ఈ దుస్తుల్లో రౌడీ హీరో క్లాసీగా కనబడుతున్నాడు. ఇక ఈ ఫొటోలు చూసి నెటిజన్లు ‘‘విజయ్ ను దాటి ఎవరూ ముందుకెళ్లలేరని, వెరీ హ్యాండ్ సమ్ హీరో’’ అని కామెంట్స్ చేస్తున్నారు.

విజయ్ ప్రజెంట్.. పూరీ జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ ‘‘జనగణమన(JGM)’’ చిత్రంతో పాటు శివ నిర్వాణ ‘‘ఖుషి’’ సినిమాలో నటిస్తున్నాడు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమా టైటిల్ ‘‘ఖుషి’’ని విజయ్ దేవరకొండ సినిమాకు యూజ్ చేసుకోవడం పట్ల ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో హీరోయిన్ గా బ్యూటిఫుల్ సమంత రూత్ ప్రభు నటిస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Vijay Deverakonda (@thedeverakonda)

Read more RELATED
Recommended to you

Latest news