అధికారంలో ఉన్నప్పుడు ముడుపులు మింగేసి, కమీషన్లు కొట్టేశారు : విజయసాయిరెడ్డి

-

ఏపీలో ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆదాయపు పన్ను శాఖ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఇన్ఫ్రా కంపెనీల సబ్ కాంట్రాక్టుల ద్వారా రూ 118 కోట్లు ముడుపులు తీసుకున్నారనే అభియోగాల కింద చంద్రబాబుకు నోటీసులు జారీ చేసినట్లు ఒక ప్రముఖ జాతీయ దిన పత్రిక పేర్కొంది. అయితే.. ఈ వ్యవహారానికి సంబంధించి చంద్రబాబు ప్రాథమిక అభ్యంతరాలను ఐటీ శాఖ తిరస్కరించినట్టు తెలుస్తోంది.

Vijay Sai Reddy turns courteous towards Chandrababu Naidu

ఐటీ శాఖ సెంట్రల్ సర్కిల్ లో కేసు నమోదైందని, 153సీ సెక్షన్ కింద నోటీసులు పంపినట్టు ఐటీ శాఖ నోటీసుల్లో పేర్కొన్నారు. కొన్ని బోగస్ సబ్ కాంట్రాక్టుల ద్వారా ఈ లెక్కాపత్రం లేని నగదు చంద్రబాబుకు ముట్టినట్టు ఐటీ శాఖ చెబుతోంది. ఇది అప్రకటిత ఆదాయంగా ఐటీ శాఖ అభివర్ణించింది. ఈ నేపథ్యంలో, వైసీపీ నేతలు చంద్రబాబుపై ధ్వజమెత్తారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందిస్తూ… చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ముడుపులు మింగేసి, కమీషన్లు కొట్టేశారని ఆరోపించారు. ఐటీ నోటీసులు రాకుండా అడ్డుపడాలన్నా కుదర్లేదని వెల్లడించారు. అడ్డంగా బుక్కైనా సరే బుకాయించడం బాబు గారి నైజం అని విజయసాయి విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news