అమరావతి పాపం విశాఖ తీరంలో కడుక్కోండి, బాబు గారూ – విజయసాయి

-

అమరావతి పాపం విశాఖ తీరంలో కడుక్కోండి, బాబు గారూ అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశారు. విభజనతో గాయపడిన ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు ఆకర్షించడానికి విశాఖపట్నంలో ‘శిఖరాగ్ర సదస్సులు’ జరిపిన నాటి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆడిన నాటకాలు అన్నీ ఇన్నీ కాదు. ఒక మోస్తరు అంతర్జాతీయ విమానాశ్రయంతోపాటు, ఎగుమతులు, దిగుమతులకు కేంద్రమైన నౌకాశ్రయం కూడా ఉన్న పెద్ద నగరం వైజాగ్‌ లో సమావేశాలు పెట్టి పెట్టుబడులు మాత్రం అమరావతి ప్రాంతంలో పెట్టాలని తెలుగుదేశం ప్రభుత్వం కోరుకునేదన్నారు సాయిరెడ్డి.

‘అమరావతిలో వేలాది ఎకరాల పంట నేలలు చౌకగా ఇస్తాం. మిలియన్ల డాలర్ల సొమ్ము ఇక్కడికి తీసుకొచ్చి, లాభాలు పండించుకోండి,’ అనేది చంద్రబాబు సర్కారు నినాదం. కృష్ణా నదీతీరంలో కనీస మౌలిక సౌకర్యాలు లేని ‘గ్రీన్‌ ల్యాండ్‌’ లో సహజంగానే డబ్బుపెట్టి సంపాదించేది ఏమీ ఉండదని ఆగ్నేయాసియా, జపాన్‌ వంటి దేశాల ప్రభుత్వాలు, పారిశ్రామికవేత్తలు భావించారు. పెట్టుబడులు రాబట్టడానికి విశాఖను వేదికగా వాడుకున్న టీడీపీ ప్రభుత్వం పంట పొలాలను సాగుకు దూరం చేసి చేయాలనుకున్న ‘ధనయజ్ఞం’ ఘోరంగా విఫలమైంది. 1953లోనే అప్పటి ఆంధ్రరాష్ట్రానికి రాజధానిగా గుంటూరు–కృష్ణా జిల్లాల ప్రాంతం వద్దని తీసుకున్న నిర ్ణయం తిరుగులేనిదని నారావారి అమరావతి ప్రయోగం నిరూపించిందని వివరించారు.

అమరావతి ప్రాంత ప్రజల గ్రామాల ప్రజలకు చేసిన నష్టం 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని వెంటాడి, ఓడించింది. అలాగే, ఏపీలోని మిగిలిన చిన్న నగరాలతో పోల్చితే పెద్ద విమానాశ్రయం, భారత నౌకాదళ కేంద్రం, అనేక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలతో విరాజిల్లుతున్న సిటీ విశాఖపట్నం. అలాంటి నగరాన్ని రాష్ట్ర రాజధానిగా చేయాలనే నిర్ణయం 2014లోనే చేయకపోవడం చంద్రబాబు చేసిన అతిపెద్ద పాపం. రేవు నగరంగా అంతర్జాతీయ వాణిజ్యపటంలో తనకంటూ ప్రత్యేక స్థానం ఉన్న విశాఖ బంగాళాఖాత తీరంలో ఎగువున ఉన్న కలకత్తా తర్వాత పెద్ద నగరం. వైజాగ్‌ బ్రాండ్‌ వాల్యూను వాడుకుని గుంటూరు, విజయవాడ మధ్య పొలాల్లో రాజధాని ప్రాంతం పేరుతో పెట్టుబడులు పెట్టించడానికి చేసిన ప్రయత్నాలు ఫలించవని చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగానే తేలిపోయిందని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news