లోకేశ్ నీలాంటి వింత జీవి భూమ్మీద కనిపించడు…నీ బాధేంటి ?

ఏపీలో పది, ఇంటర్ పరీక్షల నిర్వహణపై సస్పెన్ష్ వీడడం లేదు. సీఎం జగన్ విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచించి పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంటామన్నారు.  అయితే  విద్యార్థుల తల్లిదండ్రులు, ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు కూడా పరీక్షలు రాసేందుకు సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల తల్లిదండ్రులు అభిప్రాయం సేకరిస్తున్నారు టీడీపీ యువ నేతలు.

ఆన్ లైన్ ద్వారా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అభిప్రాయాలను సేకరిస్తే.. దాదాపు 80 శాతానికి పైగా అందరూ పరీక్షలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు తేలింది. ఈ అంశం మీద లోకేష్ ప్రతి రోజూ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. అయితే తాజాగా ఈ అంశం మీద ఆయనను విజయ సాయి రెడ్డి విమర్శించారు. లోకేష్ లాంటి వింత జీవి భూమి మీద ఇంకెక్కడా కనిపించడన్న ఆయన టెన్త్, ఇంటర్ పరీక్షలు తనే రాసాడో, బాబు ఇంకెవరితోనైనా రాయించాడో! కానీ పిల్లల భవిష్యత్తును నాశనం చేయడానికి పరీక్షలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాడు. కరోనా ప్రోటో కాల్స్ ప్రకారమే ఎగ్జామ్స్ జరుగుతాయి. నీ బాధేంటి పప్పు నాయుడు? అంటూ ఆయన ప్రశ్నించారు.