ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ కు చెందిన ఒక భవనాన్ని విశాఖపట్నం మున్సిపల్ అధికారులు కూల్చి వేసిన సంగతి తెలిసిందే. తాజాగా తన భవనం కూల్చివేత గురించి గాజువాక పోలీస్ స్టేషన్ లో మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు.. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కమిషనర్, ప్లానింగ్ ఆఫీసర్ సహా 17 మంది పైన ఫిర్యాదు చేసినట్లు సమాచారం. తనకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఇల్లు కూల్చేశారని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ ఫిర్యాదులో పేర్కొన్నారు..
అలా మొత్తం మీద విశాఖలో కూల్చివేతల రాజకీయం మాత్రం జోరుగా జరుగుతోంది. తనను విజయసాయిరెడ్డి వైసీపీలోకి ఆహ్వానించారని అయితే తాను పార్టీలోకి వెళ్లకపోవడంతోనే కక్ష కట్టి తన భవనాన్ని కూల్చేశారని పల్లా శ్రీనివాస్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఇక కొద్ది రోజుల క్రితం పల్లా శ్రీనివాస్ విశాఖపట్నం ఉక్కు కర్మాగారం కోసం నిరాహార దీక్షకు దిగారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో పోలీసులు ఆయన దీక్షను భగ్నం చేశారు.