“ఈనాడు” ను తిడితే.. టీడీపీ కుక్కలు వస్తున్నాయని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఆగ్రహించారు. రాజధాని కోసం అసైన్డ్ భూముల్ని టీడీపీ ప్రభుత్వం లాక్కుంటుందని బెదిరించి ఎస్సీ, ఎస్టీల నుంచి చిల్లరకు కొట్టేసిన 1100 ఎకరాల గురించి రాశావా రాము? అని సెటైర్ వేశారు సాయిరెడ్డి.
ఇందులో నారాయణ, లోకేశ్ సన్నిహితులే ఉన్నారు. అసైన్డ్ ల్యాండ్స్ కొన్నవారికి బాబు GO 41/2016 ద్వారా ప్లాట్లు ఇవ్వడం దుర్మార్గం అనిపించలేదా? అని నిలదీశారు. ఏమీలేని చోట నిప్పు రాజేసి చంద్రబాబులో వేడి రగిలించాలని చూస్తోంది రాము కుల మీడియా. చల్లబడి, చతికిలపడ్డ ముసలాయన లేచేది లేదు…పరుగు పెట్టేది లేదని ఆగ్రహించారు. నీచపు రాతలను ప్రశ్నిస్తే గొలుసులు విప్పి టీడీపీ కుక్కలను వదులుతారు. వాటి మొరుగుళ్లకు ప్రజలే చెప్పు దెబ్బలతో జవాబు చెబుతారని మండిపడ్డారు విజయసాయిరెడ్డి. వచ్చే ఎన్నికల్లో టీడీపీ పార్టీకి బుద్ది చెప్పాలని కోరారు.
రాజధాని కోసం అసైన్డ్ భూముల్ని టీడీపీ ప్రభుత్వం లాక్కుంటుందని బెదిరించి ఎస్సీ, ఎస్టీల నుంచి చిల్లరకు కొట్టేసిన 1100 ఎకరాల గురించి రాశావా రాము? ఇందులో నారాయణ, లోకేశ్ సన్నిహితులే ఉన్నారు. అసైన్డ్ ల్యాండ్స్ కొన్నవారికి బాబు GO 41/2016 ద్వారా ప్లాట్లు ఇవ్వడం దుర్మార్గం అనిపించలేదా?
— Vijayasai Reddy V (@VSReddy_MP) October 13, 2022